అసెంబ్లీ: టీ డ్రాఫ్ట్ బిల్లుతో హీటెక్కిన అసెంబ్లీ (పిక్చర్స్)

హైదరాబాద్: గురువారంనాడు శాసనసభ ఆవరణలో గురువారం పలకరింపులతో ప్రశాంతంగా కనిపించిన శాసనసభ్యులు శుక్రవారంనాడు మాటల ఈటెలతో ఆసెంబ్లీ ఆవరణను వేడెక్కించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చి, శాసనసభకు రాబోతుందనే వార్తల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు ప్రాంతాలవారీగా విడిపోయి పరస్పరం విమర్శనస్త్రాలు సంధించుకున్నారు.

తీవ్రమైన గందరగోళం మధ్య శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. సభను సోమవారానికి వాయిదా వేసిన తర్వాత తెలంగాణ ముసాయిదా బిల్లు శాసనసభకు చేరుకుంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిపై మండిపడ్డారు. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని చెప్పారు.

కాగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రాంతాలవారీగా విడిపోయి వాదనలు వినిపించారు. బిల్లును వెంటనే సభలో ప్రవేశపెట్టాలని తెలంగాణ శాసనసభ్యులు కోరగా, బిల్లును సీమాంధ్ర శాసనసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక్కటిగా సమైక్య నినాదాన్ని వినిపించింది.

శాసనసభలో గందరగోళం

శాసనసభలో గందరగోళం

తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో తీవ్రమైన గందరగోళం చెలరేగింది. దాంతో సబా కార్యక్రమాలు స్తంభించాయి.

ఒంటరి పోరు

ఒంటరి పోరు

సిపిఎం ఏకైక శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రజాసమస్యలపై శాసనసభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

అవే ప్లకార్డులు..

అవే ప్లకార్డులు..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సేవ్ ఆంధ్రప్రదేశ్, సమైక్యాంధ్ర నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు.

టిడిపి టీ నేతల డిమాండ్..

టిడిపి టీ నేతల డిమాండ్..

తెలంగాణ బిల్లుపై వెంటనే చర్చను ప్రారంభించాలని, వేయి మంది బలిదానాలను వృధా పోనీయవద్దని తెలుగుదేశం తెలంగామ ప్రాంత శాసనసభ్యులు కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్

సభలో సమైక్యాంధ్ర తీర్మానంపై చర్చ జరగాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు డిమాండ్ చేశారు.

నాగం తీర్మానం

నాగం తీర్మానం

తెలంగాణపై బిజెపి సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. తెలంగాణ బిల్లుపై వెంటనే చర్చ జరగాలని ఆయన కోరారు.

హరీష్ రావు విమర్శలు

హరీష్ రావు విమర్శలు

తెలంగాణ ముసాయిదా బిల్లును సభ వాయిదా పడిన తర్వాత శాసనసభకు పంపించడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి మహంతిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు మండిపడ్డారు.

తెలంగాణ కోసమే..

తెలంగాణ కోసమే..

తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగాలని సిపిఐ శాసనసభ్యుడు గుండా మల్లేష్ కోరారు. సిపిఐ తెలంగాణకు అనుకూలంగా ఉంది.

భయం వద్దని టిజి వెంకటేష్ హామీ

భయం వద్దని టిజి వెంకటేష్ హామీ

భయం వద్దని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ సీమాంధ్ర ప్రజలకు చెప్పారు. 371డికి రాజ్యాంగ సవరణ అవసరమని, అందువల్ల తెలంగాణ బిల్లు పార్లమెంటులో నెగ్గదని ఆయన అన్నారు.

సీమాంధ్ర టిడిపి రివర్స్..

సీమాంధ్ర టిడిపి రివర్స్..

సమయాన్ని వృధా చేయకుండా తెలంగాణ బిల్లుపై చర్చ చేయాలని టిడిపి తెలంగాణ శాససనసభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర టిడిపి శాసనసభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+