ఇంటర్ బోర్డ్ నిధులకే కన్నం వేశారు: అరెస్ట్(పిక్చర్స్)

హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డు నిధులను కాజేసేందుకు యత్నించిన నిందితుల్లో నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు 12 మంది నిందితులు పథకం ప్రకారం కోట్ల రూపాయల నిధులను కాజేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. మరో 8 మంది నిందితుల కోసం గాలిస్తున్నారు.

అరెస్టు అయిన నిందితులలో నండురి వెంకటరమణ, మేర్గు శ్రీనివాస్, పీటర్ అంటోని, తాడి రజని ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం డిసిపి రామరాజేశ్వరి మీడియాకు తెలిపారు. రెండు రాష్ర్టాలుగా విడిపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నిధులైన 24 కోట్ల రూపాయల్లో 3 కోట్ల రూపాయలను మల్కాజిగిరి బ్రాంచ్ అయిన బ్యాంక్ ఆఫ్‌ బరోడాకు మళ్లించే ప్రయత్నంలో వాటిని కాజేసేందుకు కొండాపూర్‌లో నివాసముండే వెంకటరమణ పథకం వేశాడు.

బషీరాబాద్ సెంట్రల్ ఎక్సైజ్ అధికారి కావురి శ్రీనివాసరావుతో ఓ కోటి రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు రూ. లక్ష కమిషన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కావురి శ్రీనివాస్‌రావు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులలో మాట్లాడి రూ. 3 కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు ఒప్పించాడు. వెంకటరమణ స్నేహితులైన మేర్గు శ్రీనివాస్, పీటర్ ఆంటోని సహాయంతో ఆంటోని స్నేహితుడైన మల్కాజిగిరికి చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి రామకృష్టతో మాట్లాడి బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే అతడి కోడలు తాడి రజని సాయంతో బ్యాంక్ మేనేజర్ చిన్నాదేవి వద్దకు వెళ్లారు.

ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగులుగా మేనేజర్‌తో పరిచయం చేసుకున్నారు. మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పి బోర్డు నిధులు రూ. 3 కోట్లు డిపాజిట్ చేసుకునేందుకు అంగీకరింపజేసుకున్నారు. రూ. కోటి డిపాజిట్ చేయాలని, రూ. 2 కోట్లు కరెంట్ అకౌంట్‌లో జమ చేయాలని బ్యాంక్ అధికారులకు వెంకటరమణ ఇంటర్మీడియట్ బోర్డు లేఖను అందించారు. దీంతో బ్యాంక్ మేనేజర్ రూ. కోటి డిపాజిట్ పత్రాన్ని అందించి, చెక్ బుక్‌లను వెంకటరమణకు ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఇచ్చిన కోటి రూపాయల డిపాజిట్ పత్రాన్ని వెంకటరమణ తన వద్దే ఉంచుకుని నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి, బ్యాంకు అధికారులుగా వెళ్లి ఇంటర్ బోర్డులో సమర్పించారు. అంతేకాకుండా లేబర్ డిపార్ట్‌మెంట్ నుంచి సైతం రూ. 5 కోట్లు డిపాజిట్ చేయించాడు. రూ. 3 కోట్లు మార్చి 26న డిపాజిట్ చేయగా, రూ. 5 కోట్లు మార్చి 30న చేశారు. అయితే, 27న 9 లక్షల 50 వేల రూపాయలను ఒక సంస్థ పేరిట డ్రా చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు జమకావడంతో బ్యాంక్ మేనేజర్ చిన్నాదేవికి అనూమానం వచ్చి, పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా, అసలు కథ బయటపడింది. ఈ పథకానికి సహకరించిన 8 మంది ఎరుకలబస్తీకి చెందిన గంధం చిన్నా, తమిళనాడుకు చెందిన మాధవన్, వనస్థలిపురానికి చెందిన ఆనంద్, పుణెకు చెందిన సునీల్‌పటేల్, నగరానికి చెందిన సుధాకర్, పశ్చిమగోదావరికి చెందిన వల్లురి రవి, నగరానికి చెందిన కావురి శ్రీనివాస్‌రావు కోసం గాలిస్తున్నట్లు డిసిపి తెలిపారు.

అరెస్టయిన వారి నుంచి నకిలీ బాండ్లు, డెబిట్ కార్డులు, ల్యాప్‌టాప్, రెండు బైక్‌లు, ఆరు సెల్‌ఫోన్లు, రబ్బరు స్టాంపులు, 60 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 2012లో బ్యాంక్‌లో నుంచి వెంకటరమణ రూ. 50 కోట్ల స్కాంకు పాల్పడ్డడాని, బెయిల్‌పై బయటకు వచ్చాడని వెల్లడించారు. వారు పెద్ద ఎత్తున నగదు డ్రా చేసుకోకముందే విచారణ చేపట్టిన ఏసిపి రవిచందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ శేఖర్‌గౌడ్‌ను ఈ సందర్భంగా డిసిపి రామరాజేశ్వరి అభినందించారు.

ఇంటర్ బోర్డ్ నిధులకే కన్నం

ఇంటర్ బోర్డ్ నిధులకే కన్నం

బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డు నిధులను కాజేసేందుకు యత్నించిన నిందితుల్లో నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

ఇంటర్ బోర్డ్ నిధులకే కన్నం

ఇంటర్ బోర్డ్ నిధులకే కన్నం

ఈ మేరకు 12 మంది నిందితులు పథకం ప్రకారం కోట్ల రూపాయల నిధులను కాజేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. మరో 8 మంది నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇంటర్ బోర్డ్ నిధులకే కన్నం

ఇంటర్ బోర్డ్ నిధులకే కన్నం

అరెస్టు అయిన నిందితులలో నండురి వెంకటరమణ, మేర్గు శ్రీనివాస్, పీటర్ అంటోని, తాడి రజని ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం డిసిపి రామరాజేశ్వరి మీడియాకు తెలిపారు.

ఇంటర్ బోర్డ్ నిధులకే కన్నం

ఇంటర్ బోర్డ్ నిధులకే కన్నం

రెండు రాష్ర్టాలుగా విడిపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నిధులైన 24 కోట్ల రూపాయల్లో 3 కోట్ల రూపాయలను మల్కాజిగిరి బ్రాంచ్ అయిన బ్యాంక్ ఆఫ్‌ బరోడాకు మళ్లించే ప్రయత్నంలో వాటిని కాజేసేందుకు కొండాపూర్‌లో నివాసముండే వెంకటరమణ పథకం వేశాడు.

ఇంటర్ బోర్డ్ నిధులకే కన్నం

ఇంటర్ బోర్డ్ నిధులకే కన్నం

బషీరాబాద్ సెంట్రల్ ఎక్సైజ్ అధికారి కావురి శ్రీనివాసరావుతో ఓ కోటి రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు రూ. లక్ష కమిషన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+