బైక్‌పై వచ్చి కాల్పులు, సాఫ్టువేర్ ఉద్యోగుల్లా ఉన్నారు: నాగరాజు
హైదరాబాద్: ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి తన పైన కాల్పులు జరిపారని, వారి వేషధారణ సాఫ్టువేర్ ఉద్యోగుల్లా ఉందని జ్యోతిష్కుడు నాగరాజు అన్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాదులోని సరూర్ నగర్‌లో నాగరాజు పైన కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. గాయపడ్డ నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి కాల్పులు జరిపారని చెప్పారు. వారు ఐదు రౌండ్లు పేల్చారన్నారు. ప్రాణభయంతో తాను హైదరాబాదులోనే గత ఆరు నెలలుగా ఉంటున్నానని తెలిపారు. తనను వచ్చింది ఇద్దరు వ్యక్తులు అన్నారు.

ఓ వ్యక్తి బైక్ పైన కూర్చోగా, మరో వ్యక్తి తన పైన కాల్పులు జరిపాడన్నారు. వారి వయస్సు ముప్పై ఏళ్లకు అటు, ఇటుగా ఉంటుందన్నారు. లండన్‌లో ఉంటున్న గోవింద్ తనను చంపేందుకు సుఫారీ ఇచ్చారని ఆరోపించారు. తమ కుటుంబానని అనవసరంగా కేసుల్లో ఇరికించారన్నారు.
తన మామ, బావమరుదులను గోవింద్ వర్గమే పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. దీని పైన సీబీఐ విచారణ జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీబీఐచే విచారణ జరిపించాలని కోరుతున్నానని చెప్పారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications