జగన్‌కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన వేణు స్వామి.. వైసీపీ టార్గెట్ మిస్
సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్యలు వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారాయన. వేణు స్వామి చెప్పిన విధంగానే సమంత, నాగచైతన్య విడిపోయారు. ఆ తరువాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన.
దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. ఇక రాజకీయ నాయకుల జాతకాలు గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణు స్వామి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్ట్ అయ్యారు. . కవిత జాతకంలో జైలుకు వెళ్లే యోగం ఉందని వేణు స్వామి ముందే చెప్పారు.వేణు స్వామి చెప్పిన కొద్ది రోజుల్లో లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయ్యారు.

ఇక ఏపీలో మరోసారి సీఎం జగనే అంటూ పలు సందర్భాల్లో వాఖ్యానించిన వేణు స్వామి.. తాజాగా వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో కూడా తెలిపారు. ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 135 సీట్లలో విజయం సాధించి సీఎం అవుతారని.. అంతేకాకుండా 2029 ఎన్నికల్లో కూడా గెలిచి జగన్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వేణు స్వామి తెలిపారు. భవిష్యత్తులో టీడీపీ కనుమరుగు అవుతుందని వేణు స్వామి జోస్యం చెప్పారు.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్ద తప్పు చేశారని..అన్నతో ఉంటేనే ఆమెకు విలువ అని..ఇక షర్మిలకు రాజకీయాలు కలిసి రావని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ 135 సీట్లలో గెలుస్తుందని చెప్పడంతో వైసీపీ శ్రేణులు నిరాశలో కురుకుపోయారు. తమ నాయకుడు 175 సీట్లలో గెలవడమే టార్గెట్ పెట్టుకుని పని చేస్తుంటే.. వేణు స్వామి 135 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందని చెప్పడంపై వారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వేణు స్వామి చెప్పినట్టుగా వైసీపీ 135 స్థానాల్లో విజయం సాధించి జగన్ మరోసారి సీఎం అవుతారేమో చూడాలి.












Click it and Unblock the Notifications