జగన్ కు సవాల్ చేసిన అచ్చెన్నాయుడు .. భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటన
కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ప్రారంభించిన ఆందోళన 300 రోజులు దాటి కొనసాగుతోంది. లక్షలాది మంది రైతులు దాదాపు ఏడాదిగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 27వ తేదీన రైతుల పిలుపుమేరకు భారత్ బంద్ కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్ కు తెలుగుదేశం పార్టీ తమ సంపూర్ణ మద్దతు తెలిపింది.
భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన టీడీపీ
ఈ నెల 27వ తేదీన రైతు సంఘాలు భారత బంద్ నిర్వహిస్తున్న క్రమంలో, ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతుల ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీకి ప్రధానమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక ఈ బంద్ లో తెలుగు దేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.

జగన్ కు దమ్ముంటే ముందు రైతులతో సమావేశం కావాలని అచ్చెన్న సవాల్
రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలను సందర్శిస్తారని చెప్పిన జగన్ కు దమ్ముంటే ముందు రైతులతో సమావేశం కావాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని, ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతోందని అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ రైతులను కూలీలుగా మారుస్తున్నారు అంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలపై టీడీపీ ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహించింది.జగన్ సర్కార్ తీరును ఎండగట్టింది.
రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలపై పునరాలోచన చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్
ఇక కేంద్ర ప్రభుత్వం రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలపై పునరాలోచన చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రైతు చట్టాల విషయంలో కేంద్రం తీరుపై టీడీపీ ఎంపీలు ఇప్పటికే పార్లమెంటులో తమ గళాన్ని వినిపించారు అని అచ్చెన్న గుర్తు చేశారు. మోడీ సర్కార్ ఇప్పటికైనా రైతు సమస్యలపై దృష్టి సారించి, వ్యవసాయ చట్టాల విషయంలో పునరాలోచన చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27వ తేదీన బంద్ నిర్వహించాలని జాతీయ రైతు సంఘాలు పెద్ద ఎత్తున తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి.
భారత్ బంద్ లో రైతు సంఘాలతో పాటు 100 ఇతర అనుబంధ సంఘాలు
ముఖ్యంగా మోడీ సర్కార్ రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్ కొనసాగనుంది. ఈ నెల 27వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని సంయుక్త కిసాన్ మోర్చా ఇప్పటికే వెల్లడించింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రైతులకు మద్దతుగా బంద్ లో పాల్గొననున్నాయి. 27 సెప్టెంబర్ 2021 న భారత్ బంద్ విజయవంతం చేయడానికి, వామపక్షాలు, కాంగ్రెస్ తో పాటు పలు జాతీయ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, యువత, బ్యాంకులు, ఉపాధ్యాయ సంఘాలతో సహా దాదాపు 100 సంస్థలు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) పిలుపునిచ్చిన సెప్టెంబర్ 27 'భారత్ బంద్'లో పాల్గొననున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications