రైతులు ఎర్రిపప్పలా... ఏపీ మంత్రులపై మండిపడిన అచ్చెన్నాయుడు

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతులను ఎర్రిపప్ప లు అంటూ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు విజయవాడలో బోండా ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టిడిపి సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా ఏపీ మంత్రుల పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు రోదిస్తుంటే వారిని ఎర్రిపప్ప లు అంటూ మంత్రులు దూషించడం ఏమిటని ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న రైతులను బూతులు తిట్టి వక్రభాష్యాలతో సమర్థించుకోవడం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలోని మంత్రులకే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. రైతులు కష్టాల్లో ఉంటే ఒక్క అధికారి కూడా వెళ్లలేదని, మంత్రులు మాత్రం నీతిమాలిన మాటలు మాటలు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

achham-

ఇక ఇదే సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేసిన అచ్చెన్నాయుడు అప్పు చేసిన 13 లక్షల కోట్ల లో జగన్ బటన్ నొక్కింది లక్షన్నర కోట్లు మాత్రమేనని, మిగిలిన పదకొండున్నర కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికల్లా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకునేది తాను నొక్కేసిన డబ్బులు లెక్క పెట్టుకోవడానికే అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

తాడేపల్లి ప్యాలెస్ డబ్బులతో నిండి పోయిందని,అందుకే ఇడుపులపాయలో సొరంగాలు తవ్వి మరీ డబ్బు దాచి పెడుతున్నారని ఆయన విమర్శించారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో రాజధాని ఏదో చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందని,రాష్ట్ర వినాశనమే లక్ష్యంగా జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా పాలన సాగిస్తున్నారని అచ్న్నచె మండిపడ్డారు.

రాష్ట్రంలో దారుణ పరిస్థితులు పోవాలంటే చంద్రబాబునాయుడు సీఎం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరమని పేర్కొన్న అచ్చెన్నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గెలవాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+