ఒక్క అవకాశమని దరిద్రాన్ని తెచ్చుకున్నారు; వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 150సీట్లు ఖాయం: అచ్చెన్నాయుడు
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు. అంతేకాదు జగన్ సర్కార్ పై పలు షాకింగ్ కామెంట్స్ చేశారు.

నాడు నేడు, ఓటీఎస్ పేరుతో వేలకోట్ల అవినీతి
ఒక్క అవకాశం అంటూ ప్రజలు దరిద్రాన్ని తెచ్చుకున్నారని అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పై విరుచుకుపడ్డారు. పాఠశాలలో నాడు-నేడు పేరుతో వేల కోట్ల అవినీతి జరుగుతుందని, పాఠశాలల్లో పది రూపాయల పనికి వంద రూపాయలు కొట్టేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇక పేదలకు పట్టాలు పేరుతో వన్టైమ్ సెటిల్మెంట్ చేసుకోవాలని, 5 వేల కోట్ల రూపాయలను వసూలు చేయడానికి సిద్ధమయ్యారని జగన్ సర్కార్ పై ఆరోపణలు గుప్పించారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

జగన్ ఎవరిపైన కేసులు పెట్టినా భయపడొద్దు
విదేశీ విద్యా దీవెన పేరుతో గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమాన్ని నిలిపివేస్తారా అని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లాలని భావించే విద్యార్థులు ఏమవ్వాలి అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షలపై లోకేష్ నాయకత్వంలో టిఎన్ఎస్ఎఫ్ తిరుగులేని పోరాటం చేసిందని పేర్కొన్న అచ్చెన్నాయుడు, జగన్ ఎవరిపైన ఎన్ని కేసులు పెట్టినా భయపడవద్దని, వారు అంత పెద్ద నాయకుడు అని అనుకోవాలి అంటూ సూచించారు. కార్యకర్తలు, నేతలు ఈ ప్రభుత్వంపై పోరాటంలో జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధపడాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలొస్తే టీడీపీదే విజయం
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రం మూడు లక్షల కోట్ల అప్పు చేస్తే, జగన్ మూడేళ్ళు కూడా కాకుండా మూడు లక్షల కోట్లు అప్పు చేశారని, రాష్ట్రాన్ని అప్పుల్లో నిండా ముంచారని అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. మూడు లక్షల కోట్లలో లక్షన్నర కోట్లు మౌలిక సదుపాయాల కోసం ఖర్చుపెడితే ఉపాధి దక్కేది అన్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, తెలుగుదేశం పార్టీ 150 సీట్లు గెలుస్తుందని అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మారువేషంలో వెళ్లి అడిగినా వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పేదిదే
ఎవరైనా మారువేషంలో వెళ్లి వైసీపీ ఎమ్మెల్యేలను అడిగినా టీడీపీ గెలుస్తుంది అని చెబుతారని అచ్చెన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలను అంతగా హింసిస్తున్నారు అంటూ అచ్చెన్న పేర్కొన్నారు. నాడు నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన జగన్, నేడు జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చాడు అంటూ అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. అంతేకాదు ఎవరు ఎన్ని చట్టాలు చేసినా అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Recommended Video

అమరావతి రైతుల పోరాటం, మాహాపాదయత్రకు కావాలని అడ్డంకులు
రాజధాని అమరావతి కోసం మహిళలు తిరుగులేని పోరాటం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పాదయాత్ర చేస్తున్న రైతులు బస చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ మండిపడ్డారు. పాదయాత్రలో ఉన్న మహిళల టాయిలెట్లు తొలగిస్తారా అంటూ మండిపడిన అచ్చెన్నాయుడు ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా అంటూ జగన్ సర్కారు తీరు పై నిప్పులు చెరిగారు. జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను, అరాచక పాలనను అచ్చెన్నాయుడు టార్గెట్ చేశారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications