వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోసాని బూతుల వెనుక ప్రశాంత్ కిషోర్ టీమ్; ఆయనో పెయిడ్ ఆర్టిస్ట్ : జగన్ పైనా అచ్చెన్నాయుడు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ రచ్చ తీవ్ర దుమారం రేపింది. పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రులు తీవ్ర పదజాలంతో విరుచుకుపడగా, సినీ నటుడు, రచయిత, నిర్మాత పోసాని కృష్ణ మురళి ఏకంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కుటుంబాన్ని వివాదంలోకి లాగి ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోయారు. దీంతో ప్రస్తుతం పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

పోసాని వ్యాఖ్యలపై స్పందించిన అచ్చెన్నాయుడు

పోసాని వ్యాఖ్యలపై స్పందించిన అచ్చెన్నాయుడు

ఇదిలా ఉంటే తాజా వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. పోసాని కృష్ణ మురళి బూతులు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయంటూ ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నటుడు పోసాని పై అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జుగుప్సాకరమైన భాషను ఉపయోగించి సంస్కృతి, సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని అచ్చెన్నాయుడు పోసాని కృష్ణమురళి భాషపై మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ ల వికృత క్రీడ కు పెయిడ్ ఆర్టిస్ట్ పోసాని అంటూ ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పీకే టీం పనే ఇదంతా .. జగన్ ఎందుకు వారించలేదు ?

పీకే టీం పనే ఇదంతా .. జగన్ ఎందుకు వారించలేదు ?

పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణమురళి చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ ఎందుకు బహిరంగంగా వారించలేదు అంటూ ప్రశ్నించారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో అంటూ అచ్చెన్నాయుడు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సామాన్యులు వినలేని, మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లి లో జగన్ ఆనందంలో మునిగి తేలుతున్నారు అని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించే కుట్ర

ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించే కుట్ర

ఇదే సమయంలో రెండు లక్షల కోట్ల డ్రగ్స్ మాఫియా కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డాగా మారిందని ద్వజమెత్తారు అచ్చెన్నాయుడు. వైసిపి మాఫియాతో ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులు కూడా కుమ్మకై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విపరీతంగా ధరలు పెరిగాయని, వైసిపి ప్రభుత్వ దోపిడీ పెరిగిపోయిందని ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో ఆ ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో వైసీపీ నేతలు కుల,మత,ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

రాజకీయ విమర్శలకు బూతులా ?ప్రజలు గుణపాఠం తప్పక చెప్తారు

రాజకీయ విమర్శలకు బూతులా ?ప్రజలు గుణపాఠం తప్పక చెప్తారు


రాజకీయ విమర్శలకు బూతులు కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేలా మాట్లాడకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు మర్చిపోకండి అంటూ అచ్చెన్నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నాడని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో కొత్త చర్చకు కారణంగా మారాయి. ఇదిలా ఉంటే పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నిప్పుల వర్షం కురుస్తుంది.

Recommended Video

Tollywood Producers Meets AP minister Perni Nani
పోసానిపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం .. ఆయన వ్యాఖ్యలపై ఖండన

పోసానిపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం .. ఆయన వ్యాఖ్యలపై ఖండన

పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ లు పెట్టకుండా బహిష్కరించాలని, తెలంగాణ రాష్ట్రం నుండి పోసాని కృష్ణ మురళి తరిమికొట్టాలని, ఇక సినీ వర్గాలు కూడా పోసాని కృష్ణమురళి పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కు మధ్య సినీ టికెట్ల విషయంలో మొదలైన రగడ వైసిపి వర్సెస్ జనసేన గా మారింది. ఇక ఇది కొనసాగుతుండగానే పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగటంతో ఈ రగడ కొత్త రూపు సంతరించుకుంది. పోసాని వర్సెస్ జనసేనగా ప్రస్తుతం వార్ కొనసాగుతుంది. నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదైంది.

English summary
AP TDP state president Atchannaidu sensation on Posani Krishna Murali is a paid artist. Achennaidu said that Prashant Kishore's team was behind the Posani whores. atchannaidu targeted Jagan over posani comments on pawan kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X