ఎటిఎం చోరుల పట్టివేత: జీతం చాలకేనని (ఫొటోలు)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఎటిఎంల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను పోలీసులు గుర్తించారు. వారిని జూటూరి హరీష్ (21), కర్కి కళ్యాణ్ కుమార్ (19)లుగా గుర్తించారు.
జూటూరి హరీష్ చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం రంగసముద్రం గ్రామానికి చెందినవాడు కాగా, కళ్యాణ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కుత్పుల్లాపూర్ సర్కిల్ గాజులరామానికి చెందినవాడు. వీరిద్దరు జీడిమెట్లలోని పల్లవి లేజర్ బ్లేడ్ పరిశ్రమో హెల్పర్లుగా పనిచేస్తున్నారు.

జీతం సరిపోవడం లేదని వీరిద్దరు కలిసి ఎంటిఎంల్లో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గాజుల రామారం గ్రామంలోని ఎస్‌బిహెచ్, మరో రెండు ఎటిఎంల్లో గత నెల 24వ తేదీన దొంగతనాలకు ప్రయత్నించి విఫలమయ్యారు.

అయితే, ఈ నెల 9వ తేదీన గాజులరామారంలో హరీష్, కళ్యాణ్ కుమార్ గడ్డపార పట్టుకుని తిరుగుతుండగా బీట్ కానిస్టేబుళ్లు పట్టుకుని అధికారులకు అప్పగించారు. విచారణలో గాజులరామారంలోని ఎస్‌బిహెచ్‌లో రూ.30,100 నగదు దొంగిలించినట్లు వారు అంగీకరించారు.












Click it and Unblock the Notifications