mekapati vikram reddy: జగన్ తో మేకపాటి విక్రమ్ రెడ్డి భేటీ-మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఉపఎన్నికల్లో 82888 ఓట్ల మెజారిటీతో గెలిచిన విక్రమ్ రెడ్డి ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఉపఎన్నిక జరిగిన తీరుపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఆత్మకూరు ఉపఎన్నికలో తన విజయానికి దోహదం చేసిన కారణాలు, నేతల సహకారం వంటి అంశాలపై సీఎం జగన్ కు మేకపాటి విక్రమ్ రెడ్డి వివరించారు. పోటో సెషన్ అనంతరం మేకపాటి బయటికి వచ్చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపఎన్నిక ఫలితాలతో పాటు ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో చర్చించినట్లు విక్రమ్ వెల్లడించారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపాదనలను సీఎం జగన్ ముందు ఉంచినట్లు తెలిపారు వాటిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్నారు.

atmakuru mla mekapati vikram reddy met ys jagan, interesting comments on minister post

గతంలో రాష్ట్రాన్నిపారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి తన అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఎంతో కృషి చేశారని, ఇప్పుడు తాను కూడా నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని విక్రమ్ రెడ్డి తెలిపారు. మరోవైపు జగన్ కేబినెట్లో స్థానం కల్పించే అంశం సీఎం సమావేశంలో చర్చకు రాలేదని విక్రమ్ వెల్లడించారు.తాను ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యానని, నేర్చుకోవాల్సింది చాలా ఉందని విక్రమ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను మంత్రి పదవికి అనర్హుడిని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

atmakuru mla mekapati vikram reddy met ys jagan, interesting comments on minister post
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+