జనసేన గెలిచే సీట్లేవి,మూడు రీజియన్లలో ఎవరికెన్ని -తేల్చేసిన సర్వే..!!

ఏపీలో ఎన్నికల్లో గెలిచేదెవరు. కూటమి - వైసీపీ మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. రెండు వైపులా గెలుపు పైన ధీమా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఈ సారి జనసేన పాత్ర కూటమిలో కీలకంగా మారుతోంది. మూడు పార్టీల కలయిక తో కలిసి వస్తుందని కూటమి నేతలు..అదే తమకు బలంగా మారుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. దీంతో, మూడు రీజియన్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు...జనసేన ఎన్ని స్థానాలు గెలుస్తుందనేది సర్వేలో అంచనాలు వెల్లడయ్యాయి.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు
ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి నాలుగో విడత అంచనాలను వెల్లడించింది. ఈ సర్వేలో వైసీపీకి 48.75 శాతం ప్రజల మద్దతు ఉండగా, టీడీపీ కూటమికి 46.50 శాతం మద్దతు ఉందని, 2.5 శాతం మంది ఇంకా తటస్థ వైఖరితో ఉన్నారని వెల్లడించింది. ఈ లెక్కన వైసీపీకి 97-118 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. టీడీపీ కూటమికి 54-62 వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, వీటిలోనే 24 స్థానాల్లో హోరా హోరీ పోరు నెలకొందని.. అందులో 16 స్థానాల్లో వైసీపీ..8 స్థానాల్లో టీడీపీ ఆధిక్యత కనిపిస్తోందని వెల్లడించింది. నెల్లూరులో హోరా హోరీ కనిపిస్తుండగా...గోదావరి జిల్లాల్లో అంచనాలకు భిన్నంగా వైసీపీ ఆధిక్యతలో ఉందని సర్వే సంస్థ విశ్లేషించింది.

Atmasakshi survey Predictions over Janasena BJP Winning seats as alliance with TDP

ప్రాంతాల వారీగా ఫలితాలు
నెల్లూరు జిల్లాలో వైసీపీ 5, కూటమి 4, గట్టి పోటీ ఒక నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇక, రాష్ట్రంలోని మూడు రీజియన్లలోనూ ఆసక్తి కర అంచనాలను వెల్లడించింది. రాయలసీమలో 52 స్థానాలు ఉండగా.. వైసీపీ 35, కూటమి 10 స్థానాలు దక్కుతాయి. దక్షిణ కోస్తాలో 55 స్థానాల్లో వైసీపీ 27, కూటమి 21 గెలిచే అవకాశం ఉంది. గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో వైసీపీ 17, కూటమి 12 గెలిచే ఛాన్స్ ఉంది. 5 నియోజకవర్గాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉండగా.. వైసీపీ 18, కూటమి 11 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఎంపీ స్థానాల్లో వైసీపీ 16, కూటమి 6 గెలుస్తాయని..మరో 3 స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉందని సర్వే సంస్థ విశ్లేషించింది.

జనసేన గెలిచేదెన్ని
ఇక, జనసేన పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా, ఆత్మసాక్షి సర్వేలో జనసేన 5-7 స్థానాలు గెలుస్తుందని అంచనాగా వెల్లడించింది.10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ 1-2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, జనసేనాని పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్దిగా పవన్ గెలచే అవకాశం ఉందని అంచనా వేసింది. 25 లోక్ సభ స్థానాల్లో..వైసీపీ 16-18 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందని విశ్లేషించింది. టీడీపీ కూటమి 6 ఎంపీ స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందని...మూడు స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొందని అంచనా వేసింది. కాగా సర్వే సంస్థ విడతల వారీగా వెల్లడిస్తున్న అంచనాల్లో క్రమేణా కూటమి బలం తగ్గి..వైసీపీ పుంజుకుంటున్నట్లు లెక్కలతో సహా వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+