ఏపీలో గెలుపెవరిది, సీన్ రివర్స్ - ఏ జిల్లాలో ఎవరికెన్ని, లేటెస్ట్ సర్వే...!!
ఏపీలో గెలిచేదెవరు. హోరా హోరీ ప్రచారం వేళ ఉత్కంఠ పెంచుతున్న అంశం. కూటమి వర్సస్ వైసీపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతోంది. గెలుపు పైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా..ప్రజా నాడి మాత్రం స్ఫష్టంగా ఉంది. ఎన్నికల సర్వేలు వరుసగా వెల్లడవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి గ్రూపు తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో సర్వే చేసింది. అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి. అధికారం ఎవరిదో క్లారిటీ ఇచ్చింది.
వైసీపీదే అధికారం
ఆత్మసాక్షి సర్వే సంస్థ ఏపీలో ఈ నెల 16 తేదీ వరకు చేసిన నాలుగో విడత అంచనాలను వెల్లడించింది. గతంలో ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో చేసిన సర్వే ఫలితాలు వాస్తవం కావటంతో ఇప్పుడు అంచనాల పైన ఆసక్తి పెరుగుతోంది. ఈ సంస్థ వెల్లడించిన అంచనాల మేరకు వైసీపీకి 48.75 శాతం ప్రజల మద్దతు ఉండగా, టీడీపీ కూటమికి 46.50 శాతం మద్దతు ఉందని, 2.5 శాతం మంది ఇంకా తటస్థ వైఖరితో ఉన్నారని వెల్లడించింది. ఈ లెక్కన వైసీపీకి 97-118 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. టీడీపీ కూటమికి 54-62 వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, వీటిలోనే 24 స్థానాల్లో హోరా హోరీ పోరు నెలకొందని.. అందులో 16 స్థానాల్లో వైసీపీ..8 స్థానాల్లో టీడీపీ ఆధిక్యత కనిపిస్తోందని విశ్లేషించింది.

ఏ జిల్లాలో ఎవరికెన్ని
జిల్లాల వారీగానూ సర్వే అంచనాలను వెల్లడించింది. శ్రీకాకుళంలో వైసీపీకి 5, కూటమికి 3, హోరా హోరీ 2 సీట్లలో ఉంది. విజయగనరంలో వైసీపీ 7, కూటమి 2 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. విశాఖలో వైసీపీ 6, కూటమి 6, హోరా హోరీ 3 సీట్లలో ఉందని అంచనా వేసింది. తూర్పు గోదావరిలో వైసీపీకి 9, కూటమి 7, మరో మూడు సీట్లలో గట్టి పోటీ ఉందని వెల్లడించింది. పశ్చిమ గోదావరిలో వైసీపీ 8, కూటమి 5, 2 స్థానాల్లో గట్టి పోటీ ఉందని విశ్లేషించింది. క్రిష్ణా జిల్లాలో వైసీపీ 10, కూటమి 5, ఒక స్థానం కీన్ కంటెస్ట్ ఉంది. గుంటూరు జిల్లాలో వైసీపీ 7, కూటమి 8, రెండు సీట్లలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ప్రకాశం జిల్లాలో వైసీపీ 5, కూటమి 4, మూడు స్థానాల్లో గట్టి పోటీ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ 5, కూటమి 4, గట్టి పోటీ ఒక నియోజకవర్గంలో కొనసాగుతోంది.
మూడు రీజియన్లలో ఇలా
కడప జిల్లాలో వైసీపీ 8, కూటమి 1, హోరా హోరీ 1 స్థానంలో ఉందని విశ్లేషించింది. కర్నూలలో వైసీపీ 10,కూటమి 2, కీన్ కంటెస్ట్ 2 స్థానాల్లో ఉందని వెల్లడించింది. అనంతపురంలో వైసీపీ 9, కూటమి 3, మరో రెండు స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ 8, కూటమి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని..కాగా, 2 సీట్లలో గట్టి పోటీ ఉందని విశ్లేషించింది. మొత్తంగా రాయలసీమలో వైసీపీ 35, కూటమి 10 స్థానాలు దక్కుతాయి. దక్షిణ కోస్తాలో 55 స్థానాల్లో వైసీపీ 27, కూటమి 21 గెలిచే అవకాశం ఉంది. గోదావరి జిల్లాల్లో వైసీపీ 17, కూటమి 12 గెలిచే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్రలో వైసీపీ 18, కూటమి 11 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఎంపీ స్థానాల్లో వైసీపీ 16, కూటమి 6 గెలుస్తాయని..మరో 3 స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉందని సర్వే సంస్థ విశ్లేషించింది.












Click it and Unblock the Notifications