సీఎం జగన్ పై రాయి దాడి: పోలీస్ ఉన్నతాధికారులకు ఏపీ సిఈవో కీలక ఆదేశం!!
ఏపీలో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ వ్యవహారం రాజకీయాలను వేడెక్కిస్తుంది. ఇక ఈ ఘటన నేపధ్యంలో రాష్ట్రంలో ఎన్నికల సమయంలో భద్రతపై సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా ఈ ఘటన నేపధ్యంలో అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.
పోలీస్ ఉన్నతాధికారులకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఆదేశాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ సమీపంలో శనివారం రాయితో దాడిచేసిన ఘటనకు సంబందించిన కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నగర పోలిసు కమీషనర్ కాంతి రాణా టాటాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించారు.

సీఎం జగన్ పై దాడి ఘటన.. పోలీస్ అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్
రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబరులో వారిరువురితో ఆయన సమావేశమై ఘటనకు సంబంధించిన పూర్వాపరాలపై సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న "మేమంతా సిద్దం" బస్సు యాత్రలో ఇటు వంటి దుర్ఝటన ఏ విధంగా చోటు చేసుకుంది, దాడి చేసేందుకు నిందితులకు ఏ విదంగా అవకాశం ఏర్పడింది, పూర్తి స్థాయిలో బందోబస్తు ఉన్నప్పటికీ నిందితులు ఏ విధంగా రాయితో దాడిచేయగలిగారు అనే విషయాలపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్షించారు.
దర్యాప్తు ప్రగతిపై ప్రశ్నించిన ముఖేష్ కుమార్ మీనా
ఈ దుర్ఝటనకు సంబందించిన పూర్వాపరాలు, ప్రస్తుతం జరుగుచున్న దర్యాప్తు ప్రగతిని వీడియో విజ్యువల్స్, ఫొటోల ద్వారా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. ఈ ఘనటకు సంబందించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్న కొంతమంది నిందితుల విచారణ ఏ విధంగా సాగుతుంది అన్నది కూడా పోలీస్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.

త్వరలో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం..
ఆ విచారణలో బయటపడిని విషయాలపైన కూడా ఆరాతీశారు. ఈ కేసుకు సంబందించిన దర్యాప్తును మరింత వేగవంతం చేసి సమగ్ర నివేదికను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖ వ్యక్తుల పర్యటనల్లో ఇటు వంటి దుర్ఝటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలనే ఆవశ్యకతను ఆయన నొక్కిచెపుతూ, అందుకు తగ్గట్టుగా రాష్ట్ర స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశంపై ఆయన ఆరాతీశారు.












Click it and Unblock the Notifications