టిడిపి అభ్య‌ర్ది పై దాడి: గాల్లోకి కాల్పులు : మ‌ంత్రాల‌యం లో టెన్ష‌న్‌..!

రాయ‌ల‌సీమ లో ఎన్నిక‌ల వేళ ఉద్రిక్త ప‌రిస్ధితులు ఏర్ప‌డుతున్నాయి. క‌ర్నూలు జిల్లా మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఖ‌గ్గ‌లు గ్రామంలో టిడిపి - వైసిపి వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. టిడిపి అభ్య‌ర్ధి తిక్కారెడ్డి పై దాడి జ‌రిగింద‌ని చెబుతున్నారు. ఘ‌ర్ష‌ణ నివార‌ణ‌కు తిక్కారెడ్డి గ‌న్‌మెన్ గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న లో తిక్కారెడ్డి తో పాటు ఏస్సైకి గాయాల‌య్యాయి.

మంత్రాల‌యంలో ఉత్కంఠ‌..
జిల్లాలోని మంత్రాలయం మండలం ఖగ్గలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్ర మంలో టీడీపీ- వైసీపీ వర్గీయుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాల్లోకి కాల్పులు జరిపారు. కాగా ఘర్షణలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వర్గీయులు వేట కొడవళ్లతో దాడికి యత్నించారని చెబుతున్నారు. ఈ ఘర్షణలో ఎడమ కాలికి గాయాలయ్యాయి.

Attack on TDP candidate in mantralayam : Fire open by gunmen

అప్రమత్తమైన నేతలు ఆయన్ను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఏఎస్సై తిరుపాల్‌కు కూడా గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం తిరుపాల్‌ను ఆస్పత్రికి తరలించడం జరిగింది. దాడి లో తిక్కారెడ్డికి గాయాల‌య్యాయా..లేక గన్‌మెన్ కాల్పుల్లో గాయ‌ప‌డ్డారా అనే అంశం పై ద‌ర్యాప్తు జ‌రుగుతోంది.

బాల‌నాగిరెడ్డి వ‌ర్గం పై ఆరోప‌ణ‌లు..
ఈ ఘ‌ట‌న పై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గాల వారీగా గ్రామాల్లో ప‌ట్టు సాగుతోంది. వైసిపి ఎమ్మెల్యే కు సంబంధించి 12 గ్రామాల్లో పూర్తి ప‌ట్టు ఉంది. ఆ గ్రామాల్లో టిడిపి అభ్య‌ర్దులు సైతం ఏజెంట్ల‌ను నియ‌మించుకొనే ప‌రిస్థితి లేద‌న్న‌ది టిడిపి వాద‌న‌. ఇక‌, ఈ గ్రామం సైతం బాల‌నాగిరెడ్డి ప్రాబ్య‌లం ఉన్న ప్రాంతం కావ‌టంతో..అక్క‌డ పోలీసులు ముందుగానే చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయినా..అక్క‌డికి తిక్కారెడ్డి వెళ్ల‌గానే బాల నాగిరెడ్డి వ‌ర్గం దాడికి దిగింద‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. అయితే, ఉద్దేశ పూర్వ‌కంగానే బాల‌నాగిరెడ్డి వర్గం త‌మ పై వేట కొడ‌వ‌ళ్ల‌తో దాడి చేసింద‌ని టిడిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. గ్రామంలొ పోలీసులు రంగ ప్ర‌వేశం చేసారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+