తండ్రికి మద్యం తాగించి.. కూతురిపై అఘాయిత్యం, 24 గంటల్లో నలుగురిపై అత్యాచారం!
గుంటూరు: గుంటూరు జిల్లా ఈపూరు మండలం వనికుంటలో దారుణం చోటుచేసుకుంది. మూగబాలికపై కన్నేసిన ఓ కామపిశాచి ఆమె తండ్రికి బాగా మద్యం తాగించి, అతడు మత్తులో మునిగిపోయాక ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
వెంకట్రావ్ అనే వ్యక్తి సదరు బాలిక తండ్రికి ఫుల్‌గా మద్యం తాగించాడు. ఆ బాలిక తండ్రి మద్యం మత్తులోకి జారిపోగానే మూగబాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఈ చర్యను ప్రతిఘటించిన ఆ బాలిక కిటికీలో నుంచి దూకి తప్పించుకుంది.

కామాంధుడు వెంకట్రావ్ నిర్వాకం గురించి ఆ మూగ బాలిక స్థానికులకు తెలియజేయడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వెంకట్రావ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Recommended Video

24 గంటల్లో నలుగురిపై అత్యాచారం...
హర్యానాలో గత 24 గంటల్లో నలుగురిపై జరిగిన అత్యాచార ఘటనలు కలకలం సృష్టించాయి. ఇండియాలోనే నేరాలు అధికంగా జరిగే రాష్ట్రాల్లో హర్యానా మూడో స్థానంలో ఉంది. హర్యానాలో శాంతిభద్రతల విషయంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
50 ఏళ్ల వ్యక్తి తన సమీప బంధువైన బాలిక(15)పై లైంగిక దాడికి పాల్పడడంతోపాటు ఆమె రహస్య అవయవాలపై కర్రతో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించగా.. మరోవైపు ఇద్దరు దళిత బాలికలను అత్యాచారం చేసి హత్య చేశారనే వార్త వచ్చింది.
మరో ఘటనలో.. యువతిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆపైన ఆమెను హతమార్చారు. ఈ దారుణ ఘటనల తరువాత హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, మిగిలిన కేసుల్లో నిందితుల ఆచూకీ తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications