రైల్లో చోరీకి యత్నం: గాలిలోకి పోలీసు కాల్పులు

Attempt rob Guhawati express passengers
నెల్లూరు: రైలు ప్రయాణికులను దోచుకోవడానికి దుండగులు విఫలయత్నం చేశారు. నెల్లూరు జిల్లా కొమవలూరు మండలం తలమంచి రైల్వే స్టేషన్ సమీపంలోని 192వ కిలో మీటర్ వద్ద దోపిడీ దొంగలు దోపిడీకి ప్రయత్నం చేశారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.

చెన్నై నుంచి గౌహతి వెళ్లే గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్ -1 బోగీలో దొంగలు చైన్ లాగి రైలును ఆపేశారు. రైలులో భద్రత కోసం ఉన్న ఆర్పీఎఫ్ ఎస్ఐ సుభానీ, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులను గమనించిన దొంగలు రైలులో నుంచి దూకి పరారయ్యారు

దొంగలను పోలీసులు వెంబడించారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే, దోపిడీ దొంగలు తప్పించుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత రైలు ప్రయాణం సాగించింది.

చెన్నైకి చెందిన దొంగల ముఠా ఈ ప్రయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వే అసిస్టెంట్ కమిషనర్ పొన్నురాజు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నెల్లూరు, గూడూరు ఆర్పిఎఫ్ ఎస్ఐలు రవిశంకర్, అర్జునరావు, స్థానిక ఎస్ఐ నగేష్ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+