పుట్టపర్తిలో అత్యాచారానికి గురైన ఐదో తరగతి బాలిక, నలుగురు సస్పెండ్

అమరావతి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహంలో దారుణం చోటు చేసుకుంది. ఈ సంఘటన పుట్టపర్తిలో సంచలనం సృష్టించింది. పుట్టపర్తిలోని ఎస్సీ హాస్టల్‌లో ఐదో తరగతి విద్యార్ధినిపై అదే హాస్టల్‌లో పనిచేస్తున్న స్వీపర్ కుమారుడు అత్యాచారం చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ వసతిగృహం అధికారులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. బాలికను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ముత్యాలు అనే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Attender raped a girl in puttaparthi hostel

ఈ అత్యాచార ఘటనకు సంబంధించి నలుగురిపై సస్సెన్షన్ వేటు పడింది. ఎంఈవో భాస్కర్‌రెడ్డి, హెచ్ఎం రామకృష్ణ, వార్డెన్ శ్రీదేవి, స్వీపర్ చౌడేశ్వరిని జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. అంతకుముందు బాధిత విద్యార్థిని కుటుంబసభ్యలు స్కూలు ముందు ఆందోళనకు దిగారు.

అత్యాచారం చేసిన నిందితుడికి స్కూల్‌కు సంబంధం లేదని సాంఘిక సంక్షేమ వసతిగృహం చెప్పినా బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం వారితో వాగ్వాదానికి దిగారు. వీరికి స్ధానిక కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు.

నిందితుడు ముత్యాలును కఠినంగా శిక్షించాలంటూ స్కూల్ ఆవరణలోనే బైఠాయించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ర్యాలీ నిర్వహించారు.

కర్నూలులో యువకుడు దారుణహత్య

కర్నూలులో ఓ యువకుడి హత్య కలకలం సృష్టించింది. పట్టణంలోని వెంకటరమణ కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్య చేసిన అనంతరం గుర్తు తెలియకుండా ఉండేందుకు మృతదేహంపై పెట్రోలు పోసి తగులబెట్టారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసున మోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+