హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ 3రోజుల్లో చెప్పకుంటే: కేసీఆర్ ఏంచెప్పినా.. సెక్షన్8 బంతి గవర్నర్ కోర్టులో

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సెక్షన్ 8 చిచ్చు రాజుకున్న విషయం తెలిసిందే. దీని పైన కొత్త కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెక్షన్ 8 పెట్టాల్సిందేనని ఏపీ ప్రభుత్వం అంటే, అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

ఈ నేపథ్యంలో సెక్షన్ 8 పైన వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా, మరో విషయం వెలుగులోకి వచ్చింది.

అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ గవర్నర్ నరసింహన్‌కు సెక్షన్ 8 గురించి పలు సూచనలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన యాక్టులోని సెక్షన్ 8ను తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించారని తెలుస్తోంది.

సెక్షన్ 8 విషయంలో తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల్లో స్పందించాలని లేదంటే గవర్నర్ దానిపై తన సొంత నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ తన విచక్షణాధికారాలు ఉపయోగించవచ్చునని చెప్పారని సమాచారం. ఈ విషయంలో గవర్నర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు.

 Attorney-General to Governor: Put K Chandrasekhar Rao on notice

సెక్షన్ 8 గురించి తొలుత తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించాలని అటార్నీ జనరల్ గవర్నర్‌కు సూచించారు. తెలంగాణ సీఎంను అభిప్రాయం అడగాలని చెప్పారు. మూడు రోజుల్లో సీఎం స్పందించాల్సి ఉంటుందని, ఆ తర్వాత గవర్నర్ విచక్షణాధికారాలు ఉపయోగించవచ్చునని చెప్పారని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విలువైన సూచనలు ఇస్తే, వాటిని నోటిఫికేషన్లో చేర్చవచ్చునని, తుది నిర్ణయం మాత్రం గవర్నర్ చేతిలోనే ఉంటుందని చెప్పారని సమాచారం. డ్రాఫ్ట్ గవర్నర్ సలహాదారులు తయారు చేయవలసి ఉంటుందని చెప్పారు.

English summary
Attorney-General to Governor: Put K Chandrasekhar Rao on notice
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X