ధర్నా: మీడియా ముందుకు ఏయు ప్రొఫెసర్(పిక్చర్స్)
విశాఖపట్నం: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు ప్రొఫెసర్ జె అప్పారావును విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎయూ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న అప్పారావు ఇంటికి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వెళ్లి, ఆయనను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వర్శిటీ విద్యార్థులు, అప్పారావు భార్య, బంధువులు ఎస్పీ కార్యాలయం ఎదుట ఉదయం నుంచి ధర్నాకు దిగారు.
గురువారం సాయంత్రం ఆరు గంటల తరువాత అప్పారావు భార్యతో మాట్లాడేందుకు ఎస్పీ అంగీకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ.. తూర్పు గోదావరి జిల్లా నుంచి అమోనియం నైట్రేట్ రవాణా అవుతోందన్న సమాచారం అందుకుని పోలీసులు మెరుపుదాడి చేశారన్నారు.

అప్పారావు భార్యా పిల్లలు
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు ప్రొఫెసర్ జె అప్పారావును విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఏయు వీసీతో విద్యార్థులు
ఎయూ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న అప్పారావు ఇంటికి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వెళ్లి, ఆయనను అరెస్ట్ చేశారు.

స్టాఫ్, విద్యార్థుల ఆందోళన
ఈ విషయం తెలుసుకున్న వర్శిటీ విద్యార్థులు, అప్పారావు భార్య, బంధువులు ఎస్పీ కార్యాలయం ఎదుట ఉదయం నుంచి ధర్నాకు దిగారు.

అప్పారావు ఫ్యామిలీతో ఏఎస్పీ
గురువారం సాయంత్రం ఆరు గంటల తరువాత అప్పారావు భార్యతో మాట్లాడేందుకు ఎస్పీ అంగీకించారు.

మీడియా ముందుకు అప్పారావు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ.. తూర్పు గోదావరి జిల్లా నుంచి అమోనియం నైట్రేట్ రవాణా అవుతోందన్న సమాచారం అందుకుని పోలీసులు మెరుపుదాడి చేశారన్నారు.

మీడియా ముందుకు అప్పారావు
తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి నుంచి కాకినాడకు చెందిన గణపతిరాజు సుబ్బరాజు అలియాస్ వర్మ (32), జికె వీధి మండలం చంపరాతిపాలెం గ్రామానికి చెందిన వసపరి ప్రసాద్ ఈ అమోనియం నైట్రేట్‌ను రవాణా చేస్తున్నారన్నారు.

పేలుడు పదార్థాలు
పోలీసులు దాడి చేసి వీరి వద్ద 500 ఎలక్ట్రికల్ డిటొనేటర్లు, 100 ఖాళీ డిటొనేటర్లు, 300 కిలోల అమోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ చెప్పారు. వీరిని విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.

మీడియా ముందుకు
ఈ పేలుడు పదార్థాలను విశాఖ ఏజెన్సీలోని మావోయిస్ట్‌లకు అందించేందుకు తీసుకువెళుతున్నట్టు చెప్పారు.

ఎస్పీ ఆఫీస్ ఎదుట ఆందోళన
ఏజెన్సీలో మైనింగ్ కాంట్రాక్టర్లపై మావోయిస్ట్‌లు ఒత్తిడి తీసుకొచ్చి, వారికి కావల్సిన వస్తువులను తెప్పించుకుంటున్నారని ఎస్పీ ప్రవీణ్ వివరించారు.

ఆందోళన
కాంట్రాక్టర్లకు, మావోయిస్టులకు మధ్య ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన జె అప్పారావు సంధానకర్తగా వ్యవహరించారని ఆయన తెలియచేశారు.

ఆందోళన
మావోయిస్ట్‌లకు కావల్సిన కెమెరా ఫ్లాష్‌లు, ట్యాబ్స్, బ్యాటరీలు, హార్డ్ డిస్క్‌లు అప్పారావు అందించేవారని ఎస్పీ చెప్పారు.

ఆందోళన
పోలీసుల అదుపులోని ప్రసాద్, సుబ్బరాజును విచారించగా ప్రొఫెసర్ అప్పారావు, కాకినాడకు చెందిన కొవ్వూరు జగదీష్‌రెడ్డి పాత్ర బయటపడిందని చెప్పారు. వెంటనే రెండు బృందాలు వెళ్లి అప్పారావు, జగదీష్‌రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువచ్చాయని చెప్పారు.

ఆందోళన
ఇంత పెద్ద మొత్తంలో అమోనియం నైట్రేట్ మావోయిస్ట్‌లకు అందితే భారీ విధ్వంసాలే జరిగేవని ఎస్పీ ప్రవీణ్ వెల్లడించారు. వీరిపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ నలుగురిని కోర్టుకు హాజరుపరిచామని ఎస్పీ వివరించారు.
తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి నుంచి కాకినాడకు చెందిన గణపతిరాజు సుబ్బరాజు అలియాస్ వర్మ (32), జికె వీధి మండలం చంపరాతిపాలెం గ్రామానికి చెందిన వసపరి ప్రసాద్ ఈ అమోనియం నైట్రేట్‌ను రవాణా చేస్తున్నారన్నారు. పోలీసులు దాడి చేసి వీరి వద్ద 500 ఎలక్ట్రికల్ డిటొనేటర్లు, 100 ఖాళీ డిటొనేటర్లు, 300 కిలోల అమోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ చెప్పారు. వీరిని విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఈ పేలుడు పదార్థాలను విశాఖ ఏజెన్సీలోని మావోయిస్ట్‌లకు అందించేందుకు తీసుకువెళుతున్నట్టు చెప్పారు.
పోలీసుల అదుపులోని ప్రసాద్, సుబ్బరాజును విచారించగా ప్రొఫెసర్ అప్పారావు, కాకినాడకు చెందిన కొవ్వూరు జగదీష్‌రెడ్డి పాత్ర బయటపడిందని చెప్పారు. వెంటనే రెండు బృందాలు వెళ్లి అప్పారావు, జగదీష్‌రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువచ్చాయని చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో అమోనియం నైట్రేట్ మావోయిస్ట్‌లకు అందితే భారీ విధ్వంసాలే జరిగేవని ఎస్పీ ప్రవీణ్ వెల్లడించారు. వీరిపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ నలుగురిని కోర్టుకు హాజరుపరిచామని ఎస్పీ వివరించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications