వివాహేతర సంబంధం: నిద్రిస్తున్న ఆటో డ్రైవర్ గొంతును కొడవలితో కోసి చంపారు
అమరావతి: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.... పట్టణంలోని రేగాటిపల్లె రైల్వేగేట్ సమీపంలో నివాసం ఉండే బాబావలీ (22) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
అయితే అతనికి బంధువైన ఓ యువతితో గత కొన్ని రోజులుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన యువతి తరుపు బంధువులు బాబావలీకి వార్నింగ్ ఇచ్చి తీరు మార్చుకోమని హెచ్చారించారు.
అయినా సరే అతను తీరు మార్చుకోక మరింతగా రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి ఆవరణలో ఆరు బయట నిద్రించిన ఆతడిని గుర్తు తెలియని వ్యక్తులు కొడవలితో గొంతుకోసి చంపేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ధర్మవరం పట్టణ ఎస్సై ఎస్సై గణేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే అతడిన చంపి ఉంటారని బాబావలీ నాయనమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక మృతి
కర్నూలు జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ బాలిక మృతిచెందింది. కొడుమూరు తహశీల్దార్ కార్యాలయం ముందు ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కొడుమూరుకు చెందిన కీర్తి (15) మృతి చెందగా, ఆమె సోదరికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన బాలికను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రితో కలసి ఇద్దరు బాలికలు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎమ్మినగూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన విశాఖపట్నంలోని ఆనందపురంలో చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో గుడికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన ఆమె ఆదృశ్యమైంది. తెలిసినవాళ్ల దగ్గర, బంధువుల వద్ద వెతికినా లాభం లేకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పాలవలస గ్రామానికి చెందిన మాధురి తన ఇద్దరు పిల్లలతో శుక్రవారం గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications