ఏపీలో యువత ఉపాధికి రెక్కలు.. తొలి ఏవియేషన్ అకాడమీకి శంకుస్థాపన!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ 300కోట్ల రూపాయల పెట్టుబడితో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో మరో కీలక అడుగు పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 'జార్విస్ ఏవియేషన్ అకాడమీ' ఏర్పాటుకు అధికారికంగా శంకుస్థాపన జరిగింది.

రాజమండ్రిలో రాష్ట్రంలోనే మొదటి విమాన శిక్షణ సంస్థ

రాజమండ్రి విమానాశ్రయం మధురపూడి సమీపంలో రాష్ట్రంలోనే మొదటి విమాన శిక్షణ సంస్థ Flight Training Organization - FTO ఏర్పాటు కాబోతుండటం విశేషం.ఈ ప్రతిష్టాత్మక అకాడమీ నిర్మాణ పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి బీజేపీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, స్థానిక పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై, శంకుస్థాపన చేశారు.

aviation training in ap MP Purandeswari Lays Foundation for Jarvis Aviation Academy in Rajahmundry

రూ. 100 కోట్ల భారీ పెట్టుబడితో జార్విస్ ఏవియేషన్ అకాడమీ.. యువతకు ఉపాధి

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మరియు విమానయాన రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ.. దేశంలో ఏవియేషన్ రంగం ఎంతో వేగంగా విస్తరిస్తోందని, దానికి అనుగుణంగా నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. రాజమండ్రిలో సుమారు రూ. 100 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కాబోతున్న ఈ జార్విస్ ఏవియేషన్ అకాడమీ ద్వారా స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అత్యాధునిక కోర్సులతో ఏవియేషన్ శిక్షణ

కేవలం పైలట్ శిక్షణే కాకుండా.. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్ మేనేజ్‌మెంట్‌ వంటి వివిధ విభాగాలలో ఈ సంస్థ ద్వారా అత్యాధునిక కోర్సులను అందిస్తారు.గోదావరి రీజియన్‌లో ఈ తరహా అంతర్జాతీయ అకాడమీ రావడం వల్ల ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని స్థానిక ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ న్యూస్.. రూ.300కోట్లతో అమరావతిలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్!
సూపర్ న్యూస్.. రూ.300కోట్లతో అమరావతిలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్!

ఏవియేషన్ శిక్షణకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు

విమానయాన రంగంలో కెరీర్ లో పురోగతి సాధించాలనుకునే తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇకపై సుదూర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రాజమండ్రిలోనే అద్భుతమైన వసతులు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ పురందేశ్వరి అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అకాడమీ ప్రతినిధులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+