YS Viveka Case కుట్ర జరుగుతోంది - అవినాష్ ఆందోళన, డెసిషన్ టైం..!!
కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. వైఎస్ తొలుత చెప్పిన మాటలను ఇప్పుడు పూర్తిగా మార్చేసారని చెప్పుకొచ్చారు. హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ సాగుతున్న వేళ అవినాష్ పులివెందులలో ఉన్నారు. ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. సుప్రీం ఆదేశాల ఉత్తర్వులు అందితే ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం నిర్ణయం మేరకు సీబీఐ నిర్ణయాలు ఉండనున్నాయి.
ముందస్తు బెయిల్ విచారణ:వివేకా హత్య కేసులో అవినాష్ ఎపిసోడ్ లో చోటు చేసుకొనే పరిణామాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. అవినాష్ ను ఇప్పటికే ఆరు సార్లు విచారించిన సీబీఐ, ఎంపీ ఇచ్చిన సమాచారం ఆధారంగా సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని విచారించారు. హత్య జరిగిన రోజున కీలకంగా మారిన లేఖ గురించి ఆరా తీసినట్లు సమాచారం. సుదీర్ఘంగా సునీత- రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించింది. సుప్రీంకోర్టులో అవినాష్ పిటీషన్ పైన వెలువడిన నిర్ణయాలతో హైకోర్టులో జరిగే విచారణ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం అవినాష్ ముందసు బెయిల్ పిటీషన్ పై విచారణ జరగాల్సి ఉన్నా, సుప్రీంకోర్టు ఉత్తర్వుల పరిశీలన కోసం ఈ రోజు (బుధవారం) కు కేసు వాయిదా వేసారు. మరోసారి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో ఈ రోజు ప్రస్తావిస్తే ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

పులివెందులలో అవినాష్:సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన తరువాత అవినాష్ పులివెందుల వెళ్లారు. అక్కడ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహించారు. మరో రెండు రోజులు పులివెందులలోనే ఉండనున్నారు. ఈ సమయంలో తన పైన వస్తున్న ఆరోపణల పైన అవినాష్ ఆవేదన వ్యక్తం చేసారు. సునీత ఇస్తున్న స్టేట్ మెంట్స్ లో ఒక్కో సారి ఒక్కో విధంగా ఉంటున్నాయన్నారు. ఘటన జరిగిన సమయంలో లేఖ దాచిన విషయంలో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారని గుర్తు చేసారు. ఇప్పుడు సునీత మాట మార్చారన్నారు. రాజశేఖర్ రెడ్డి తనకు ఫోన్ చేసిన ఘటన గురించి చెప్పారని పేర్కొన్నారు. 15 నిమిషాలు ఫోన్ రావటం ఆల్యం అయి ఉంటే తన మీద నిందలు ఉండేవి కావన్నారు. కేసులో తనను ఇరికించే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఈ ఘటనతో సంబంధం లేదన్నారు. దస్తగిరితో రాయించిన లేఖను చూస్తే అర్దం అవుతుందని వివరించారు.
అంతా దైవాదీనం:సీబీఐ తనను అరెస్ట్ చేస్తుందనే ప్రచారం పైన అవినాష్ స్పందించారు. సిబిఐ మిమ్మల్ని అరెస్టు చేస్తుందా అని ఓ మీడియా ప్రశ్నించగా అంతా దైవాదీనం అంటూ సమాధానం ఇచ్చారు. ధర్మమే తనను కాపాడుతుందని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి వాడితో జిల్లా ప్రజలకు తెలుసని అవినాష్ వ్యాఖ్యానించారు. సనీత, రాజశేఖర్ రెడ్డిని సీబీఐ మూడు గంటలకు పైగా విచారించింది. వివేకా చనిపోవటానికి ముందు రాసినట్లుగా చెబుతున్న లేఖను రాజశేఖర రెడ్డి సూచనల మేరకే తొలుత పోలీసులకు ఇవ్వకుండా దాచారని అవినాష్ పలు మార్లు ఆరోపించారు. దర్యాప్తు తుది దశకు చేరుకున్న సమయంలో కోర్టుకు నివేదికలో ప్రతీ అంశాన్ని పొందుపర్చాలనే ఇప్పుడు ఈ ఇద్దరి నుంచి వాంగ్మూలం సేకరించినట్లు సమాచారం. హైకోర్టులో విచారణ, సీబీఐ నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications