Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆయేషా మీరా హత్య కేసు: ఎట్టకేలకు పునర్విచారణ, సిట్ ఏర్పాటు, పర్యవేక్షక బాధ్యత గౌతమ్ సవాంగ్ కు

సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో పునర్విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేసింది.

అమరావతి: సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో పునర్విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేసింది.

డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. సిట్ పర్యవేక్షక బాధ్యతలను విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం అప్పగించింది.

Ayesha-Miera-Goutham Sawang

2007లో విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో ఆయేషా మీరా హత్యకు గురైన విషయం, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు నివ్వడం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా ఈ కేసులో మళ్లీ విచారణ జరగనుంది. ఇప్పుడైనా అసలు దోషులు బయటికి వస్తారా? ప్రత్యేక విచారణ బృందా ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఈ కేసులో దోషులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+