Ram mandir consecration: ద్వాపర యుగం నాటి రాములోరి గుడి..ఇక్కడి తాబేళ్లు సంథింగ్ స్పెషల్..!
Ram mandir consecration:భారత దేశం హిందూ సంప్రదాయాలకు సంస్కృతికి పుట్టినిల్లు. ఇక్కడ ఎన్నో ఆలయాలు వెలిశాయి. నాటి రాజులు ఏలిన కాలం నుంచి నేటి ప్రభుత్వాల వరకు ఎన్నో దేవలయాలు నిర్మితమయ్యాయి. ఒక్కో దేవాలయానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఇలాంటి దేవాలయాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఉన్న నెల్లిమర్లలో ఉన్న రామతీర్థ ఆలయం. ఈ రాములోరి ఆలయం ద్వాపరయుగం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు.
క్రీస్తుపూర్వం 3శతాబ్దంలో రామతీర్థ ఆలయం నిర్మించినట్లు చరిత్రకారులు వివరిస్తున్నారు.అయితే స్థానికులు చెప్పే వివరణ ఇందుకు భిన్నంగా ఉంది.ఈ ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహాలకు వెండి కవచం ఉంటుంది. ఈ వెండి కవచంతో కూడిన విగ్రహాలను పాండవులు ప్రతిష్టించారని విశ్వసిస్తారు.దేశంలోని ఇతర పురాతన ఆలయాలకు ఉన్న విశిష్టతే నెల్లిమర్ల రామతీర్థ ఆలయంకు ఉన్నప్పటికీ... ఈ దేవాలయం యొక్క సహజమైన పరిస్థితులు,ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలు మరింత ఆధ్యాత్మికతను చాటుతాయి.

శ్రీరామతీర్థం ఆలయంకు మరో ప్రత్యేకత ఉంది.ఈ ఆలయంలో రామస్తంభాన్ని శ్రీ పెద్ద జీయర్ స్వామివారు ప్రతిష్టించారు. భక్తులు దీన్ని కేవలం ఒక స్తంభంలా భావించరు. దేశంలో రామాలయాల నిర్మాణానికి ఇది కొనసాగింపుగా భావిస్తారు.ఇది సజీవంగా ఉన్న వారసత్వ సంపద.భగవంతుడికి భక్తులు ఇచ్చే బహుమానంగా చూస్తారు.

రోజంతా దైవ దర్శనం కోసం భక్తులు తహతహలాడుతుంటారు.ఆలయంలో ఎక్కడైతే భక్తుల రద్దీ తక్కువగా ఉంటుందో అక్కడ రామజపం చేస్తున్న ఆత్మలు తాబేళ్ల రూపంలో స్వేచ్ఛగా తిరుగుతాయని నమ్ముతారు.ఈ ఆలయంలో తిరిగే తాబేళ్ల కవచంపై వైష్ణవులు నుదిటిపై దిద్దే తిలకం ఆకారం ఉంటుంది.అయితే ఇక్కడ మాత్రమే కనిపించే తాబేళ్ల కవచంపై విష్ణునామంతో కూడిన గుర్తు ఎలా వస్తున్నాయనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం లభించలేదు. అయితే ఇక్కడకు వచ్చే సందర్శకులు లేదా భక్తులు ఈ తాబేళ్లను చేసి భలే సంబరపడుతుంటారు.ఈ తాబేళ్లు ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.వీటి మూలాలు వివిధ ఇతిహాసాలు, జానపద కథలతో ముడిపడి ఉన్నాయి.

ఇది నెల్లిమర్లలోని రామతీర్థ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇక్కడి స్థానికులు ఈ ఆలయం గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ ఉన్నారని, పాండవులు నడియాడిన నేల ఇదని చెబుతుంటారు. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, వింతలు ఉండటంతో ఇది మహిమానత్వమైన ఆలయంగా చరిత్రలో నిలిచింది.ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు వచ్చి రాములోరి ఆశీర్వచనాలు పొందుతుంటారు.












Click it and Unblock the Notifications