ఏటా రూ.950కోట్లు వృథా: చంద్రబాబుపై అయ్యన్నపాత్రుడు సంచలనం
వివిధ పండగల సందర్భాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేస్తున్న సీఎం చంద్రబాబు.. ఏటా రూ. 950కోట్లు వృథా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం: ఏపీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివిధ పండగల సందర్భాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేస్తున్న సీఎం చంద్రబాబు.. ఏటా రూ. 950కోట్లు వృథా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇలాంటి తాత్కాలిక పథకాల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని అన్నారు. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం మర్రిపాలెంలో సోమవారం నిర్వహించిన నాలుగో విడత జన్మభూమి, మా ఊరు కార్యక్రమంలో మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొని ప్రసంగించారు.

పోలవరం లాంటి శాశ్వత ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తాను స్వయంగా సీఎం చంద్రబాబు వద్ద కూడా ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో కొన్ని పొరపాటు్లు వాస్తవమేనని, వాటిని కూడా లేకుండా చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications