వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజుకున్న నిప్పు-అయ్యన్న వర్సెస్ జోగి-నిరసనలు, ఫిర్యాదులు-ఎక్కడా తగ్గని వైసీపీ, టీడీపీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య నిన్న మొన్నటి వరకూ సాగిన మాటల యుద్ధం, విమర్శలూ, ప్రతి విమర్శలూ ఓ ఎత్తయితే తాజాగా బీసీ నేతలైన అయ్యన్నపాత్రుడు, జోగి రమేష్ మధ్య మొదలైన తాజా యుద్ధం మరో ఎత్తుగా మారుతోంది. సీఎం జగన్ పై దూషణలకు దిగిన అయ్యన్నపాత్రుడిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ దండెత్తగా.. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు టీడీపీ, వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పరస్పర నిరసనలు, ఫిర్యాదులు, మాటల యుద్ధం హోరెత్తుతోంది.

అయ్యన్న వర్సెస్ జోగి వార్

అయ్యన్న వర్సెస్ జోగి వార్


ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రెండేళ్లుగా సాగుతున్న పొలిటికల్ వార్ అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలి వైసీపీ సీరియస్ గా తీసుకోవడంతో మరో మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ టీడీపీ నేత నారా లోకేష్ వంటి వారు ఎన్ని వ్యాఖ్యలు చేసినా సీరియస్ గా తీసుకోని వైసీపీ ఇప్పుడు అయ్యన్న వ్యాఖ్యలపై నిరసనకు దిగడం, జోగి రమేష్ రంగంలోకి దిగి చంద్రబాబు ఇల్లు ముట్టడికి వెళ్లడంతో మొత్తం రాజకీయం బిగ్ టర్న్ తీసేసుకుంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మైలేజ్ గేమ్ కోసం ఇరు పార్టీలు పోటాపోటీగా నిరసనలు చేపడుతూ, ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నాయి.

పరస్పర ఫిర్యాదులు, కేసులు

పరస్పర ఫిర్యాదులు, కేసులు


అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలపై ముందుగా స్పందించి జోగి రమేష్ రంగంలోకి దిగితే.. ఇప్పుడు ఆయన బాటలోనే మిగతా వైసీపీ నేతలు కూడా రంగంలోకి దిగుతున్నారు. అయ్యన్నపాత్రుడిపై ఎక్కడికక్కడ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. నిన్న జోగి రమేష్ ను అడ్డుకున్న టీడీపీ నేతలపై ప్రభుత్వం ఏకంగా అట్రాసిటీ కేసులే పెట్టింది. అదే సమయంలో వైసీపీ నేతల ఫిర్యాదులతో అయ్యన్నపాత్రుడిపైనా రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. అటు టీడీపీ కూడా జోగి రమేష్ వ్యాఖ్యలపై ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేస్తోంది. దీంతో పోలీసులకు ఏం చేయాలో తెలియని పరిస్ధితి.

 వైసీపీ, టీడీపీ నిరసనల హోరు

వైసీపీ, టీడీపీ నిరసనల హోరు

అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ, జోగి రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు. ప్రత్యర్ధి నేతలపై చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నారు. పలు చోట్ల దిష్టి బొమ్మల దహనాలతో పాటు వివిధ పద్ధతుల్లో నిరసనలు చేపడుతున్నారు. దీంతో పోలీసులకు వీరిని నియంత్రించడం కష్టంగా మారుతోంది. ఇప్పటికే పలు చోట్ల నిరసనల్ని అడ్డుకుంటూ పోలీసులు విపక్ష టీడీపీ నేతలపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు.

వైసీపీ, టీడీపీ మాటల తూటాలు

వైసీపీ, టీడీపీ మాటల తూటాలు

అటు అయ్యన్నపాత్రుడు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఇరు పార్టీల నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మాటల యుద్ధానికి దిగుతున్నారు. హోంమంత్రి రాజీనామా చేయాలన్న అయ్యన్న వ్యాఖ్యలపై సుచరిత మండిపడ్డారు. తన రాజీనామా కోరడానికి ఆయనెవరన్నారు. సభ్యతా సంస్కారం లేని అయ్యన్నపాత్రుడు నుంచి ఇంతకంటే మంచి మాటలు ఎందుకు వస్తాయని సుచరిత ప్రశ్నించారు. నాపై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయన్నారు. మహిళలపై అయ్యన్నపాత్రుడుకి ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టి తెలుస్తుందన్నారు. ఆయన వ్యాఖ్యలపై సమాజం కూడా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినందువల్ల అయ్యన్న పాత్రుడి స్థాయి దిగజారిందే తప్ప, ముఖ్యమంత్రి గారి ప్రతిష్టకు భంగం కలగదని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అటు టీడీపీ నేతలు కూడా జోగి రమేష్ పై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఇంటికి నేను వెళ్తున్నానని పోస్టు పెడితే ఇంటిలిజెంట్స్ ఏం చేస్తున్నారు.? ఇంట్లో తొంగుతున్నారా.? అధికార పక్ష ఎమ్మెల్యే అనుమతి లేకుండా వెళ్తాడా.? అయ్యన్న జగన్ పై మాట్లాడితే చంద్రబాబు ఇంటికి దాడికి వెళ్తావా.? కర్రలతో మీరు వెల్లి దాడి చేసి టీడీపీ వాళ్లు దాడి చేశారని చెప్తున్నారు. వినతిపత్రం ఇవ్వడానికి వెల్లినప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లాలి. అంతేగాని కర్రలు, గునపాలు పెట్టుకుని వెళ్తారా.? అని టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత ప్రశ్నించారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ స్పందించిన తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య ఖండించారు. అధికార పార్టీ నాయకులు, పోలీసులను అసభ్యకరంగా మాట్లాడితే అసోసియేషన్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.

వెనక్కి తగ్గని అయ్యన్న, జోగి రమేష్

వెనక్కి తగ్గని అయ్యన్న, జోగి రమేష్

అటు అయ్యన్నపాత్రుడు, జోగి రమేష్ కూడా ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. నిన్నటి ఘటనల తర్వాత ఇరువురు నేతలు శాంతిస్తారని భావించినా వారు మాత్రం మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇద్దరూ తమ వ్యాఖ్యలకు కట్టబడటమే కాకుండా మాటల దాడిని మరింత తీవ్రతరం చేశారు. అర్జీ ఇవ్వడానికి వెళ్ళడం దండయాత్రా..!? -నా కారు ఆగకముందే, కారులో నుంచి దిగకముందే నాపై టీడీపీ గూండాలు దాడి చేశారు. -నాపై దాడి చేయించిందీ, దాడికి ప్రేరేపించిందీ బాబే..
-దొంగే.. దొంగ అన్నట్లుగా పచ్చ మీడియాలో మాపై ఎదురు దాడి చేస్తారా..? -అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై బాబు క్షమాపణలు చెప్పాల్సిందే. -అయ్యన్న వ్యాఖ్యలకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చంద్రబాబే అని జోగి రమేష్ అన్నారు. అటు అయ్యన్నపాత్రుడు కూదా తన వ్యాఖ్యల్ని సమర్ధించుకుంటూ వైసీపీ నేతల తీరుపై విరుచుకుపడ్డారు.

English summary
blame game between ysrcp and tdp begins in andhrapradesh with protests and complaints against ayyannapatrudu and jogi ramesh each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X