అంతా బాబు క్రుషే,,! అమ‌రావ‌తి కి అంత‌ర్జాతీయ గుర్తింపు తెచ్చిన F1H20 పవర్ బోటింగ్..!!

హైద‌ద‌రాబాద్/ ఏపి : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో F1H20 గ్రాండ్ పిక్స్ పోటీలను ఏపి ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హించింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ రేస్ వీక్షకుల్ని ఉత్కంఠ‌త‌కు గురిచేసింది. గంట‌కు దాదాపు 200 కిలోమీట‌ర్ల వేగంతో రేస‌ర్లు త‌మ ప‌వ‌ర్ బోట్ల‌ను ప‌రుగులు పెట్టించిన తీరు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించింది. ఈ పోటీలో అబుదాబి టీమ్ డ్రైవర్ టోరెంట్ షాన్ విజేతగా నిలిచాడు. రెండో స్థానాన్ని ఎమిరేట్స్ టీమ్ మహిళా డ్రైవర్ మారిట్ స్ట్రోమోయ్, మూడో స్థానాన్ని అబుదాబి డ్రైవర్ ఎరిక్ స్టార్క్ ద‌క్కించుకోవ‌డం విశేషం.

అమ‌రావ‌తి అభివ్రుద్దికి బాబు క్రుషి..! గుర్తింపు తెచ్చిన బోటింగ్..!!

అమ‌రావ‌తి అభివ్రుద్దికి బాబు క్రుషి..! గుర్తింపు తెచ్చిన బోటింగ్..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అలుపెరుగ‌ని కృషి చేస్తున్నట్టు పెద్ద యెత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబ‌ర్-1గా నిల‌బెట్టేందుకు నిరంత‌రం ప‌రిత‌పిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌క‌ F1H20 పవర్ బోటింగ్ రేసును నిర్వ‌హించింది. ఆదివారంతో ముగిసిన ఈ రేసింగ్‌.. క్రీడా, ప‌ర్యాట‌క రంగాల్లో ఏపీ ఖ్యాతిని ప్ర‌పంచం న‌లుదిశ‌లా చాటిచెప్పింది.

తెలుగు రాష్ట్రాల్లో బోటింగ్ కు ఆద‌ర‌ణ త‌క్కువ‌..! ఐనా వినూత్న ప్ర‌యోగం చేసిన బాబు..!

తెలుగు రాష్ట్రాల్లో బోటింగ్ కు ఆద‌ర‌ణ త‌క్కువ‌..! ఐనా వినూత్న ప్ర‌యోగం చేసిన బాబు..!

వాస్త‌వానికి F1H20 గ్రాండ్ పిక్స్ పోటీలో పాల్గొనే స‌త్తా ఉన్న రేస‌ర్లు మ‌న రాష్ట్రంలోగానీ, ఇంకా చెప్పాలంటే మ‌న దేశంలోగానీ ప్ర‌స్తుతానికి లేరు. అయినప్ప‌టికీ సొంత గ‌డ్డ‌పై నిర్వ‌హిస్తున్న పోటీల్లో మ‌న ప్రాతినిధ్యం లేక‌పోతే బాగుండ‌ద‌ని ఏపీ ప్ర‌భుత్వం భావించింది. అందుకే విదేశీయులైన ఎరిక్ ఎడెన్‌, జోన‌స్ అండ‌ర్స‌న్‌ల‌ను టీమ్ అమ‌రావ‌తి త‌ర‌ఫున బ‌రిలో దింపింది. వీరిద్ద‌రూ ఫైనల్‌కి అర్హత సాధించ‌డంతో అంచ‌నాలు భారీగా పెరిగాయి.

తొలిసారి క్రిష్ణ న‌దిలో బోటింగ్ రేసులు..! మంత్ర ముగ్ధులైన బెజ‌వాడ‌ వాసులు..!!

తొలిసారి క్రిష్ణ న‌దిలో బోటింగ్ రేసులు..! మంత్ర ముగ్ధులైన బెజ‌వాడ‌ వాసులు..!!

అయితే ఎడెన్ ఆరో స్థానంతో సరిపెట్టుకోగా.. 32వ ల్యాప్‌ వద్ద బోట్ క్రాష్ అవడంతో అండర్సన్ 11వ స్థానంతో సంతృప్తి చెందాడు. రేసింగ్‌లో టీమ్ అమ‌రావ‌తి సాధించిన ఫ‌లితాలెలా ఉన్నా.. తాము అనుకున్న‌ ల‌క్ష్యాన్ని అందుకోవ‌డంలో మాత్రం చంద్ర‌బాబు టీం స‌ఫ‌లీకృత‌మైంద‌నే చెప్పాలి. తొలిసారిగా అమ‌రావ‌తి రాష్ట్రంలో ఈ పోటీల‌ను నిర్వ‌హించారు.

అల‌రించిన అంత‌ర్జాతీయ రేస‌ర్లు..! పుల‌కించిన క్రిష్ణ‌మ్మ‌..!!

అల‌రించిన అంత‌ర్జాతీయ రేస‌ర్లు..! పుల‌కించిన క్రిష్ణ‌మ్మ‌..!!

ఈ పోటీలో ఆస్ట్రేలియా, చైనా, ఫిన్‌లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, పోలాండ్‌, పోర్చుగల్‌, స్వీడన్‌, థాయ్‌లాండ్‌, యూఏఈ, యూఎస్‌ఏ, నార్వే తదితర దేశాల‌కు చెందిన రేస‌ర్లు పాల్గొన్నారు. త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. అంటే క్రీడారంగంలో, ఆతిథ్య‌-ప‌ర్యాట‌క రంగంలో రాష్ట్ర ఖ్యాతి ఆయా దేశాల‌కు వ్యాపించిన‌ట్లే. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హాజ‌రై పోటీల‌ను తిల‌కించ‌డం ఈ రేసింగ్‌కు ఆయ‌న ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పింది. దీంతో అమ‌రావ‌తి ఖ్యాతిని అంత‌ర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు బాబు క్రుషి చేస్తున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+