బాబుపై బాబుమోహన్ ఆసక్తికర వ్యాఖ్య, జనసేన ర్యాలీ

 Babu Mohan
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన ఇటీవలే ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి, ప్రముఖ నటుడు బాబు మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కూడా తన వలె టిడిపిలోకి వచ్చిన వారే అన్నారు. టిడిపిని స్థాపించింది బాబు కాదని, ఎన్టీఆర్ అన్నారు.

తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మూడు రోజుల తర్వాత కూడా చంద్రబాబు నుంచి స్పందన కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ఆరంభించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన టిడిపిలో చేరారు.

బాబుపై జూపల్లి మండిపాటు

తెలంగాణ ప్రాంతంలో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు బిసి మంత్రం జపిస్తున్నారని తెరాస నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. సీమాంధ్రలో టిడిపి అధికారంలోకి వస్తే బిసిని ముఖ్యమంత్రిని చేస్తారా అని ప్రశ్నించారు. పార్టీని విలీనం చేయలేదంటూ కెసిఆర్‌ను, తెరాసను విమర్శించే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు.

జనసేన బైక్ ర్యాలీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ యువభేరి పేరుతో తొలి బహిరంగ సభను విశాఖపట్నంలో గురువారం నిర్వహించనుంది. జనసేన సభకు సంఘీభావంగా పవన్ కళ్యాణ్ అభిమానులు విశాఖ నగరంలో ఈ రోజు బైక్ ర్యాలీ చేపట్టారు. మద్దిలపాలెం నుంచి పి.ఎం.పాలెం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పలువురు అభిమానులు పాల్గొన్నారు. రేపు జరిగి పవన్ సభను విజయవంతం చేయాలని జనసేన కార్యకర్తలు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+