గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డాక్టర్ నిర్లక్ష్యం: బిడ్డ మృతి, బంధువులు ఆందోళన (వీడియో)

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం లో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ పురిటి బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. పట్టణం లో నివాసం ఉంటున్న కె. నాగవన్య నిండు గర్భిణీ గా ఆసుపత్రి లో చేరింది.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం లో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ పురిటి బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. పట్టణం లో నివాసం ఉంటున్న కె. నాగవన్య నిండు గర్భిణీ గా ఆసుపత్రి లో చేరింది. రాత్రి పొద్దుపోయాక నాగవన్య కు పురిటి నొప్పులు వస్తున్నాయని డాక్టర్ కి తెలియజేశారు. నాగవన్య ను పరిశీలించిన లేడీ డాక్టర్ కాన్పుకు సమయం ఉందని తెలిపారు.

అయినప్పటి కి నాగవన్య కు నొప్పులు ఆగలేదు. మరోసారి డాక్టర్కి బంధులు తెలియజేసారు. ఈ నేపధ్యం లో డాక్టర్ నాగవన్యకు ఆపరేషన్ చేయాలని తెలిపారు. అయితే ఈ రోజు ఉదయం వరకు చూసి ఆపరేషన్ చేస్తానని తెలిపారు. ఈ లోగానే నాగవన్య తెల్లవారు ఝామున ఓ బేబీ కి జన్మ నిచ్చింది. డాక్టర్ నిర్లక్ష్యం గా ఉన్న కారణం గా నాగవన్య ఆపరేషన్ లేకుండానే బిడ్డ కు జన్మ నిచ్చింది.

Baby dies in hospital at Repalle

ఈ సమయం లో బిడ్డ ఉమ్మ నీరు మింగిన కారణం గా ఆ పసిబిడ్డ నీలి రంగు లోకి మారి పోయింది. బిడ్డ పరిస్థితి బాగోలేదని డాక్టర్కి తెలియ జేస్తే నిర్లక్ష్యం గా వ్యవహిరించిన డాక్టర్ తీరు తో విరిగిపోయిన నాగవన్య బంధువులు మెరుగైన వైద్యం కోసం బిడ్డను గుంటూరు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నారాకోడూరు చేరుకునే సరికి బిడ్డ మరణించినట్లు బంధువులు గుర్తించారు. చేసేది ఏమీ లేక మరలా వెనక్కు తీసుకెళ్లారు.

బిడ్డ మరణించడం జీర్ణించుకోలేని బేబీ బంధువులు రేపల్లె పట్టణం లో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మొదట బిడ్డ జననం విషయం లో డాక్టర్ శ్రద్ధ వహించి ఉంటె ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఆగ్రహించి రోడ్డు పై ఆందోళనకు దిగారు. డాక్టర్ కి ఎన్ని సార్లు చెప్పినా కాన్పు విషయం లో నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ రోడ్డు పై ఆందోళన చేపట్టారు. సకాలంలో లో నాగవన్యకు ఆపరేషన్ చేస్తే బిడ్డ బ్రతికేది అని బంధువులు డాక్టర్ తీరు ను తప్పు బట్టి నిరసన కు దిగారు.

English summary
Tension prevailed at Repalle in Guntur district o Andhra Pradesh following the death of a baby in hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X