నిర్లక్ష్యం: స్మశానికి తీసుకెళ్తుంటే బతికిన పాప! రాజమండ్రిలో పేలుడు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విజయవాడలో చనిపోయిందనుకున్న పసిపాప బతికింది! ఓ ప్రయివేటు ఆసుపత్రి వైద్యుల నిర్వాకం వల్ల ఆ పసిపాపను శ్మశానికి తీసుకు వెళ్తున్నారు. ఆ సమయంలో పాప ఊపిరి తీసుకుంది.
తన పాపకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పాపను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. డిశ్చార్జ్ చేశారు. దీంతో, ఆ తల్లిదండ్రులు పాపను శ్మశాన వాటికకు తీసుకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు.
శ్మశాన వాటికకు తీసుకు వెళ్తుండగా ఆ పాప శ్వాస తీసుకోవడాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఆ తల్లిదండ్రులు ఆనందం పట్టలేకపోయారు. వెంటనే పాపను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ పాప మూడు రోజుల క్రితం జన్మించింది.

ఇసుక సీజ్
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని సత్యనారాయణపూరంలో 320 క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. దాడులు చేసి పట్టుకున్నారు.
కారు బోల్తా పడి కోమాలోకి వెళ్లిన పెళ్లికొడుకు
ఎశ్పీఎస్ నెల్లూరు జిల్లాలో పెళ్లి బృందం కారు బోల్తాపడి పెళ్లి కొడుకు కోమాలోకి వెళ్లిన సంఘటన జరిగింది. వెంకటగిరి శివార్లలో పెళ్లి బృందం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పెళ్లి కొడుకు కోమాలోకి వెళ్లాడు. పెళ్లి కొడుకు గ్రామం మిట్టకండ్రిగ. రేపు పెళ్లి జరగవలసి ఉంది.
రాజమండ్రి అపార్టుమెంటులో పేలుడు
రాజమండ్రిలోని రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఓ అపార్టుమెంటులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. బాంబు పేలినట్లుగా అనుమానిస్తున్నారు. పేలుడు కారణంగా అపార్టుమెంటు వాసులు భయంతో బయటకు పరుగు తీశారు. ఈ పేలుడు ధాటికి అపార్టుమెంటు రెండో అంతస్థులోని అద్దాలు పగిలాయి.












Click it and Unblock the Notifications