వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి వెనుకబడిన దక్షిణాఫ్రికా దేశం ఆదర్శమా ? జగన్ వ్యాఖ్యలపై ఏపీలో హాట్ టాపిక్

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానులు ఉండే అవకాశం ఉంది అని సీఎం జగన్ చేసిన ప్రకటనతో ఏపీలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. దక్షిణాఫ్రికా లాంటి దేశాలలో మూడు రాజధానులు ఉన్నాయని, మనం కూడా మారాలి అని, మన రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు రావచ్చు అని సీఎం జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది.

మూడు రాజధానుల నిర్ణయం .. ప్రతిపక్షాలకు చెక్ పెడుతుందా ? జగన్ కు ప్లస్ అవుతుందా?మూడు రాజధానుల నిర్ణయం .. ప్రతిపక్షాలకు చెక్ పెడుతుందా ? జగన్ కు ప్లస్ అవుతుందా?

జగన్ వ్యాఖ్యలతో దక్షిణాఫ్రికాపై ఏపీలో పెద్ద చర్చ ..

జగన్ వ్యాఖ్యలతో దక్షిణాఫ్రికాపై ఏపీలో పెద్ద చర్చ ..

ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలకు ఆదర్శంగా తీసుకుంటారు కానీ,అభివృద్ధి చెందిన దేశాలను ఫాలో అవుతారు కానీ వెనుకబడ్డ దేశం గురించి చెప్పి దానిని ఆదర్శంగా తీసుకోవాలని ఎలా చెబుతారని ఏపీలో చర్చ జరుగుతోంది. అంతేకాదు దక్షిణాఫ్రికా దేశానికి 3 రాజధానుల విషయంలో అప్పట్లో నెల్సన్ మండేలా తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేస్తున్నారు. నెల్సన్ మండేలా వంటి మేధావే మూడు రాజధానులపై వ్యతిరేకత వ్యక్తం చేస్తే, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు నిర్ణయం తీసుకోవడం ఏ విధంగా కరెక్ట్ అంటూ చర్చించుకుంటున్నారు.

వెనుకబడిన దేశం ఏపీకి ఆదర్శమా?

వెనుకబడిన దేశం ఏపీకి ఆదర్శమా?

ఈ నాటికి సౌతాఫ్రికాలో మూడు రాజధానులు కారణంగా ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. పాలనాపరమైన అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక దక్షిణాఫ్రికా సైతం మూడు రాజధానిలో నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనను చేస్తుంది. ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశాలుగా గుర్తించబడిన బ్రిటన్, అమెరికాలనుఆదర్శంగా తీసుకోవచ్చుకదా అలా కాకుండా దక్షిణాఫ్రికా ని ఆదర్శంగా తీసుకోవడం ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మూడు రాజధానుల దక్షిణాఫ్రికా అభివృద్ధి చెందినదా అని చర్చ

మూడు రాజధానుల దక్షిణాఫ్రికా అభివృద్ధి చెందినదా అని చర్చ

దక్షిణాఫ్రికా దేశాన్ని ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలంటూ రాజకీయ పార్టీల నేతలే కాదు, కొందరు ప్రజలు సైతం అడుగుతున్నారు. మూడు రాజధానులతో దక్షిణాఫ్రికాకు కలిగిన ప్రయోజనం ఏమిటో చెప్పాలన్న డిమాండ్ సైతం వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానులు ప్రకటన, దక్షిణాఫ్రికాతో పోల్చి చెప్పిన వైనం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఆసక్తికర చర్చకు కారణమైంది.

English summary
There is debate in the AP about how someone would take the ideal to the developed country but not about the backward country. It is also recalled that Nelson Mandela was vehemently opposed to the South African nation's 3 capitals. If intellectuals like Nelson Mandela oppose the three capitals, then CM Jaganmohan Reddy is now discussing how the three capitals in AP will decide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X