పండుగలవేళ ఏపీలో రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రయాణాలు చేయాలనుకునే వారికి పండుగల వేళ బ్యాడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. విజయవాడ కాజీపేట సెక్షన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు, పలు రైళ్లను దారి మళ్ళిస్తున్నట్టు పేర్కొంది.
పలు రైళ్ళు రద్దు
ఈ మేరకు విజయవాడ రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 25వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు విజయవాడ డోర్నకల్ (07755/07756), అలాగే విజయవాడ భద్రాచలం (07979/07978) రైళ్ళను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈ నెల 28, 29 జనవరి 2, 5,8, 9 తేదీలలో గుంటూరు-సికింద్రాబాద్ (12705/12706) రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

విజయవాడ సికింద్రాబాద్ తో పాటు ఈ రైళ్ళు రద్దు
ఈనెల 27వ తేదీ, జనవరి 1, 4, 7, 8, 9 తేదీలలో విజయవాడ సికింద్రాబాద్ (12713/12714) రైళ్ళను రద్దు చేశారు. అంతే కాదు ఈనెల 28, 30 జనవరి 4, 6 తేదీలలో కొచువెల్లి ఇండోర్ (22645/22646) రైళ్ళను, డిసెంబర్ 26, 31 తేదీలతో పాటు జనవరి 5, 8 తేదీలలో గోరఖ్ పూర్ కొచువెల్లి (12511/12512) రైళ్లను రద్దు చేశారు.
ఎర్నాకులం, కాన్పూర్ మదురై వెళ్ళే రైళ్ళు రద్దు
ఎర్నాకులం బరౌని (12521/12522) రైళ్లను ఈనెల 27, 30 జనవరి 3, 6, 10 తేదీలలో రద్దు చేశారు.
ఈనెల 25,27 తేదీలతో పాటు జనవరి 3, 8, 10 తేదీలలో కాన్పూర్ మధురై 01927/01928 రైళ్లను, జబల్పూర్ మధురై 02121/02122 రైళ్ళను రద్దు చేశారు. డిసెంబర్ 25, 28 తో పాటు జనవరి 1, 4 తేదీలలో ధన్బాద్ కోయంబత్తూర్ 03325/03326 రైళ్ళను రద్దు చేశారు.
కొన్ని రైళ్ళ దారి మళ్లింపు
అంతే కాదు ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు గుంటూరు సికింద్రాబాద్ (17201/17202) రైలును గుంటూరు కాజీపేట వద్ద పాక్షికంగా రద్దు చేశారు. ఇక ఈనెల 26, 28 , 30 తేదీలతో పాటు 1,2,6,8 తేదీలలో కొచువెల్లి కోబ్రా )22647/22648) రైళ్ళను రద్దు చేశారు. ఇక మరికొన్ని రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి మీదుగా దారి మళ్లించారు.
విశాఖపట్నం- ముంబై ఎల్టీటీ రైలు దారి మళ్లింపు
సాయి నగర్ షిరిడి- కాకినాడ పోర్ట్ జనవరి 7, 8 తేదీలలో దారి మళ్ళించారు. అలాగే మచిలీపట్నం- సాయి నగర్ షిరిడి రైలు కూడా జనవరి 7, 8 తేదీలలో దారి మళ్ళించారు. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు విశాఖపట్నం- ముంబై ఎల్టిటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ను దారి మళ్లించారు.
హజరత్ నిజాముద్దీన్ నుండి వెళ్ళే రైళ్ళు దారి మళ్లింపు
ఈనెల 27వ తేదీన హజరత్ నిజాముద్దీన్- త్రివేండ్రం, ఈనెల 28వ తేదీన మరియు జనవరి 4, 6 తేదీలలో హజరత్ నిజాముద్దీన్- కన్యాకుమారి, జనవరి ఏడవ తేదిన హజరత్ నిజాముద్దీన్ - ఎర్నాకులం రైళ్ళను దారి మళ్ళించారు. జనవరి 8,9 తేదీలలో విశాఖపట్నం- సికింద్రాబాద్, జనవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు భువనేశ్వర్ - ముంబై రైళ్లను దారి మళ్లించారు.
ప్రయాణికులకు అలెర్ట్
జనవరి 2,7 తేదీలలో ధనాపూర్ - బెంగళూరు జనవరి 2, 4 తేదీలలో ధనాపూర్ - బెంగళూరు రైళ్ళను దారి మళ్ళించారు. ఇక ఈ రైళ్ల రద్దులు, దారి మళ్లింపులను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు తగిన విధంగా ప్రయాణాలు చేయడానికి ప్లాన్ చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications