పూర్తయింది కాబట్టి అర్హుడే: మోపిదేవికి కోర్టు బెయిల్

Mopidevi Venkataramana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మాజీ మంత్రి, శాసన సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు సోమవారం బెయిల్ లభించింది. మోపిదేవికి సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. కేసు విచారణ పూర్తయినందున మోపిదేవి బెయిల్‌కు అర్డుడు అని కోర్టు తెలిపింది. ఆయన ఈ రోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశముంది.

కాగా, జగన్ ఆస్తుల కేసులో నిందితుడైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరణ నాలుగు రోజుల క్రితం గురువారం కోర్టు ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆయన అంతకుముందు మధ్యంతర బెయిల్‌పై బయట వచ్చారు. అనారోగ్యం కారణంగా కోర్టు గతంలో ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ మంజూరు చేసింది.

బెయిల్ గడువుకు ముందే అతను కోర్టు ఎదుట లొంగిపోయారు. మోపిదేవికి సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 31వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అనంతరం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అతనికి ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. జగన్ ఆస్తుల కేసులో ఇప్పటికే వైయస్ జగన్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్ వ్యవహారంలో మోపిదేవిని సిబిఐ నిందితుడిగా చేర్చింది. జగన్ ఆస్తుల కేసులో తొలుత అరెస్టయింది మోపిదేవి వెంకటరమణనే. అరెస్టు అయ్యాక ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆయన 2012 మే 24వ తేదీన అరెస్టయ్యారు. అంతకు ముందు రోజు ఏడు గంటల పాటు విచారించిన సిబిఐ అధికారులు మర్నాడు అరెస్టు చేశారు.

ఈడి ఎదుట విజయ సాయి

మరోవైపు విజయ సాయి రెడ్డి ఢిల్లీలో ఈడి ఎదుట హాజరయ్యారు. వాన్‌పిక్ కేసులో ఆయనను ఈడి అధికారులు విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+