బాలకృష్ణ - రాజమౌళి కాంబినేషన్ లో మిస్ అయిన 2 సినిమాలు
దర్శక ధీరుడు రాజమౌళి సీనియర్ కథానాయకులతో సినిమాలు చేయలేదు. అయితే నందమూరి బాలకృష్ణతో మాత్రం చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల అవి పట్టాలకెక్కలేదు. వారిద్దరి కాంబినేషన్ లో అభిమానులు రెండు సినిమాలను మిస్ చేసుకున్నారు. అప్పుడు కనుక ఆ సినిమాలు బాలయ్య చేసుంటే ఎలా ఉండేదో అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, భూమి నాయకా నాయికలుగా తెరకెక్కిన సింహాద్రి సినిమాను మొదటగా బాలకృష్ణతో చేయాలనుకున్నారు రాజమౌళి. ముందుగా ఈ సినిమా కథను బాలయ్యకు వినిపించారు. రాజమౌళి అప్పటికి ఒక్క సినిమా మాత్రమే చేశారు. అది.. స్టూడెంట్ నెంబర్ వన్. పలనాటి బ్రహ్మనాయుడు సినిమాతో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. రాజమౌళితో సినిమా చేయడానికన్నా బి.గోపాల్ డైరెక్షన్ లో పలనాటి బ్రహ్మనాయుడు చేయడానికి బాలకృష్ణ మొగ్గుచూపారు.

దీంతో రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించారు. ఈ సినిమా ఇండస్ట్రీహిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మగధీర కథను కూడా ముందుగా బాలకృష్ణకే వినిపించారు రాజమౌళి. అయితే ఆ సినిమాలో నటించే అవకాశాన్ని కూడా బాలయ్య వదులుకున్నారు. సింహాద్రితోపాటు మగధీరను కూడా మిస్ చేసుకున్నారు. ఈ సినిమా గీతా ఆర్ట్స్పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు కథానాయకుడిగా పాన్ వరల్డ్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. జులై కల్లా script పూర్తిచేసి దర్శకుడికి అందించబోతున్నట్లు రచయిత విజయేంద్రప్రసాద్ బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రెండు భాగాలుగా ఈ సినిమా తీయడానికి అర్హమైందని, ఇందులో క్లైమాక్స్ ఇందుకు ఆస్కారమిస్తోందని వెల్లడించారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోంది. ఇది పూర్తయిన తర్వాత రాజమౌళి షూటింగ్ కు హాజరుకాబోతున్నారు.












Click it and Unblock the Notifications