నా మౌనం భయంకరం ..నేను ఒక్క సైగ చేస్తే ఏం జరిగేదో తెలుసా..బాలకృష్ణ వార్నింగ్

హిందూపురం‌లో టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు నిన్న తన సొంత నియోజకవర్గం అయిన హిందూపురం లో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. బాలయ్య రాయలసీమ ద్రోహి అని, హైకోర్టును అడ్డుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని ఏపీలో అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారంటూ బాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.బాలకృష్ణ గో బ్యాక్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు . దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక దీనిపై స్పందించిన బాలకృష్ణ వైసీపీ కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

నిన్న ఒక్క సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేదో అన్న బాలయ్య

నిన్న ఒక్క సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేదో అన్న బాలయ్య

నిన్న బాలకృష్ణ కాన్వాయ్ అడ్డుకుని మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని నిరసనకారులు నిరసన తెలిపిన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. దీనిపై బాలకృష్ణ స్పందించారు. తాను నిన్న ఒక్క సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేది? అని ఆయన ప్రశ్నించారు. కానీ, చట్టంపై తమకు గౌరవం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ఆర్సిపి కార్యకర్తలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు బాలకృష్ణ . వారిని వదిలిపెట్టటం టీడీపీ చేతగానితనం కాదని అన్నారు.

Recommended Video

    TDP MLA Balakrishna Faced Major Embarrassment Situation In Hindupur || Oneindia Telugu
    వైసీపీ నిన్న చేసిన పని విష సంస్కృతికి నిదర్శనం

    వైసీపీ నిన్న చేసిన పని విష సంస్కృతికి నిదర్శనం

    మీడియాను ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ ఈ తరహా కార్యకలాపాలను తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇది విష సంస్కృతి అని విమర్శించారు. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇరవై మంది మాత్రమే భయాందోళనలు సృష్టించారని, వెయ్యి మందికి పైగా ఉన్న తన అనుచరులకు ఒక సైగ చేస్తే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సమస్యలను సృష్టించడం టిడిపి సంప్రదాయం కాదని బాలకృష్ణ అన్నారు.

    అన్ని విషయాల్లో అరాచకమే .. సహనాన్ని పరీక్షించొద్దన్న బాలకృష్ణ

    అన్ని విషయాల్లో అరాచకమే .. సహనాన్ని పరీక్షించొద్దన్న బాలకృష్ణ

    రాయలసీమలో హైకోర్టును బాలకృష్ణ అడ్డుకుంటున్నారంటూ స్థానికులతో కలిసి వైసీపీ నేతలు, కార్యకర్తలు నిన్న ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్న తీరుపై అసహనం వ్యక్తం చేసిన బాలకృష్ణ ఏపీలో రాజధాని విషయంలో, ఇక సెలెక్ట్ కమిటీకి రాజధానుల బిల్లు పంపే విషయంలో , మండలి రద్దు చేసి కేంద్రానికి పంపిన అంశంలో వైసీపీ ప్రభుత్వం అరాచాకానికే దిగుతుందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తన సహనాన్ని పరీక్షించవద్దని చెప్పారు. తన మౌనం భయంకరం అని ఆయన పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+