బాలకృష్ణ భేటీ: పవన్ కళ్యాణ్ భాగమేనంటూ అయ్యన్నపాత్రుడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడిని హిండూపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ మంగళవారంనాడు కలిశారు. కాగా, అయ్యన్నపాత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మీడియాతో మాట్లాడారు.
తన నియోజకవర్గం హిందూపురంలో పంచాయతీ రోడ్ల నిర్మాణం గురించి తాను అయ్యన్నపాత్రుడిని కలిసినట్లు, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించినట్లు బాలకృష్ణ చె్పపారు. హిందీ నీవా సుజల స్రవంతి ద్వారా ఈ ఏడాది చివరినాటికి హిందూపురానికి నీళ్లు అందుతాయని ఆయన చెప్పారు.

హిందూపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. బెంగళూరు హైవేతో హిందూపురాన్ని అనుసంధానించాలని మంత్రిని బాలకృష్ణ కోరారు .
కాగా, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగమేనని అయ్యన్న పాత్రుడు అన్నారు. తప్పనిసరి అయితేనే రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరిస్తామని ఆయన చెప్పారు. రాజధాని పరిధిలోని రైతులను భూములు ఇవ్వడానికి ఒప్పిస్తే తాము పవన్ కళ్యాణ్‌తో కలిసి నడుస్తామని ఆయన చెప్పారు.
రైతులు భూములు ఇవ్వకపోతే రాజధాని నిర్మాణం ఆగిపోతుందని మంత్రి అయ్యన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ అనేక వాగ్దానాలు చేశారని, ఆ హామీలన్నింటినీ నెరవేర్చి ఏపీకి సహకరిస్తారన్న నమ్మకం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాజధాని భూమిపై కాకుండా గాలిలో కడతారా..అలాంటి టెక్నాలజీ ఏదైనా ఉందేమో జగన్ చెప్పాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications