ఫ్యాన్ ఫ్యామిలీతో బాలయ్య: దుర్మార్గమన్న చంద్రబాబు
అనంతపురం/ గుంటూరు: లెజెండ్ సినిమా విజయోత్సవ ర్యాలీలో గాయపడి మరణించిన శ్రీధర్ కుటుంబ సభ్యులను అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ శనివారం పరామర్శించారు. అన్ని విధాల ఆదుకుంటామని శ్రీధర్ కుటుంబానికి ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వెంకటరాయుడిని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
వచ్చే నెల మూడు తర్వాత హిందూపురంలో మలివిడత ప్రచారం చేపడతానని బాలయ్య తెలిపారు. హిందూపురంలో మంచి మెజారిటీతో గెలుస్తామని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా హిందూపురం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన శనివారంనాడు పలువురు నాయకులతో సమావేశమయ్యారు. కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. హిందూపురం ప్రజలు తనపట్ల మంచి ఆదరణ చూపారని, అది ఎప్పటికీ మరిచిపోలేనిదని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు అనుసరించిన వైఖరిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. ఆయన శనివారంనాడు గుంటూరు జిల్లా రేపల్లెలో రోడ్ షో నిర్వహించారు. సీమాంధ్ర రాజధాని ఎక్కడో కూడా చెప్పకుండా కాంగ్రెసు దుర్మార్గంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇప్సస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద యెత్తున పరిశ్రమలు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. వృద్ధులు, వికలాంగుల పింఛన్ల మొత్తాన్ని పెంచుతానని చెప్పారు.












Click it and Unblock the Notifications