తల్లి, పిల్ల కాంగ్రెసులకు పాలించే అర్హత లేదు: బాలయ్య

హైదరాబాద్: తల్లి, పిల్ల కాంగ్రెసులకు పాలించే హక్కు లేదని ప్రజలు తీర్పు ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు,, నందమూరి హీరో బాలకృష్ణ అన్నారు. కాంగ్రెసును తల్లి కాంగ్రెసుగానూ వైయస్సార్ కాంగ్రెసును పిల్ల కాంగ్రెసుగానూ ఆయన అభివర్ణించారు. మున్పిపల్, కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలపై ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి పట్టం కడుతూ నగర, పురపాలక సంఘాల ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కడుతూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించారని ఆయన అన్నారు. మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపికి అఖండ విజయం సాధించి పెట్టినందుకు ఆయన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Balakrishna says results reflected the development

హిందూపురం మున్పిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకి విజయం సాధించి పెట్టినందుకు ఆయన పార్టీ నేతలను, కార్యకర్తలను అభినందించారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సారథ్యంలో పాలన గాడిలో పడుతుందని, అభివృద్ధి జరుగుతుందని నమ్మి ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు.

కాంగ్రెసు నేతల విచ్చలవిడి అవినీతిని, దోపిడీ విధానాన్ని ప్రజలు తిప్పికొట్టారని ఆయన అన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆయన అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీన శాసనసభ, లోకసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+