వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం కుర్చీలో బాలకృష్ణ: దావోస్‌లో చంద్రబాబు, లోకేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

సీఎం గా బాలకృష్ణ: అసలేం జరిగిందంటే..?

అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ తీరు విమర్శలకు తావు కల్పిస్తంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుర్చీలో కూర్చుని ఆయన సమీక్ష నిర్వహించారు.

బాలకృష్ణ తీరుపై సర్వత్రా చర్చ సాగుతోంది. బాలకృష్ణ బుధవారం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో లేపాక్షి పుస్తకాల అంశంపై సమీక్ష నిర్వహించారు.

బాలయ్య ఇలా, మంత్రి అలా

బాలయ్య ఇలా, మంత్రి అలా

సమీక్షా సమావేశంలో బాలకృష్ణ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, ఐఎఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి వచ్చిన అధికారులు ఏమీ అనలేకపోయారు.

బాలయ్య తీరుపై విస్తుపోయిన అధికారులు

బాలయ్య తీరుపై విస్తుపోయిన అధికారులు

కేవలం ఎమ్మెల్యే మాత్రమే అయిన బాలకృష్ణ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం చూసి విస్తుపోవడం ఐఎఎస్ అధికారుల వంతయింది. ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి లేదని చెప్పే బాలకృష్ణ సిఎం కుర్చీలో కూర్చోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏమీ మాట్లాడని దేవినేని...

ఏమీ మాట్లాడని దేవినేని...


బాలకృష్ణ సిఎం కుర్చీలో కూర్చోవడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఏమీ మాట్లాడడం లేదు. దీంతో ప్రోటోకాల్‌పై విస్తృత చర్చ జరుగుతోంంది. ముఖ్యమంత్రి కుర్చీలో ఓ ఎమ్మెల్యే కూర్చోవడం ఏ మేరకు సమంజసమనే ప్రశ్న ఉదయిస్తోంది.

దావోస్‌లో చంద్రబాబు, లోకేష్

దావోస్‌లో చంద్రబాబు, లోకేష్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడూ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం దావోస్‌లో ఉన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో వారు బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి తగిన పెట్టుబడులను రాబట్టేందుకు వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

English summary
Telugu DesamParty MLA Nandamuri Balakrishna has occupied Andhra Pradesh CM Nara Chandrababu Naidu's chair during a review meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X