వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘అఖండ’ తో ఆరంభం- జగన్ మార్క్ దెబ్బ తో విలవిల : అమరావతికి పరిగెత్తాల్సిందేనా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ప్రభుత్వం తాజా నిర్ణయాల పైన సీనీ పెద్దలు పదే పదే కోరుతున్నా.. మార్పు మాత్రం కనిపించటం లేదు. తాజాగా ప్రభుత్వం టిక్కెట్ల ధరలను ఖరారు చేసింది. సెంటర్ల వారీగా వాటి ధరలను ఫిక్స్ చేసింది. వాటిని చూసి ధియేటర్ల యాజమన్యాలు లబోదిబో మంటున్నాయి. అయితే, టిక్కెట్ల ధరలు పెంచేది లేదు.. బెనిఫిట్ షో లకు అవకాశం ఇవ్వం...ఆన్ లైన్ ద్వారానే టిక్కెట్లను విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రభుత్వ నిర్ణయాలతో టెన్షన్

ప్రభుత్వ నిర్ణయాలతో టెన్షన్

ప్రభుత్వ బెనిఫిట్ షోల రద్దు ... టిక్కెట్ ధరల పెంపు లేకపోవటంతో తొలి ఎఫెక్ట్ ప్రముఖ హీరో..టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం ద్వారా మోదలైంది. 'అఖండ' మూవీ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. సింహ, లెజెండ్ తర్వాత బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ ధియేటర్లలో చూసేందుకు ఉత్సాహంతో ఉన్నారు. మూవీ చూసిన అభిమానులు.. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెబుతున్నారు. థియేటర్ల ముందు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.

అఖండకు పాజిటివ్ స్పందన

అఖండకు పాజిటివ్ స్పందన

ట్విట్టర్ వేదికగా అఖండ చూసిన సినిమా జనం మాస్ జాతర, నెక్ట్స్ లెవల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే బాలయ్య సినిమా పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మరో వైపు ఇదే టిక్కెట్ల ధరల అంశం పైన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతించింది. "అఖండ" విడుదల తరువాత సంక్రాంతి వరకు ప్రముఖ హీరోల మూవీలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. పుష్ప, ఆర్ఆర్‌ఆర్‌, భీమ్లా నాయక్‌ తదితర చిత్రాల 'కలెక్షన్ల'పై సినీ పరిశ్రమ వర్గాల్లో గుబులు మొదలైంది.

టిక్కెట్ ధరలు గిట్టుబాటు కావంటూ

టిక్కెట్ ధరలు గిట్టుబాటు కావంటూ

1990వ దశకంలో నేల టికెట్‌ ధర 5 రూపాయలు ఉండేది. ఇప్పుడు గ్రామ పంచాయతీల్లోని నాన్‌ ఏసీ థియేటర్లలో ఎకానమీ టికెట్‌ ధర 5 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాలు, నగరాల్లోని మల్టీప్లెక్స్‌ల లో ప్రీమియం, డీలక్స్‌ క్లాస్‌ల ధరలపట్ల కొంత సంతృప్తిగానే ఉన్నప్పటికీ... మిగిలిన అన్ని ధరలు గిట్టుబాటు కావని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1200కి పైగా సినిమా థియేటర్లున్నాయి. వాటిని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. గతంలో.. కొత్త చిత్రం విడుదలైన తర్వాత తొలి వారం రోజులు టికెట్‌ ధరలను పెంచుకునే అవకాశం థియేటర్ల యజమానులకు ఉండేది.

ప్రభుత్వం బ్రేకులు

ప్రభుత్వం బ్రేకులు


అయితే వకీల్‌సాబ్‌ చిత్రం నుంచి ప్రభుత్వం బ్రేక్‌లు వేసింది. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న తరువాత ఈ ప్రభావం పడుతున్న తొలి సినిమా "అఖండ" . ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం తమకు సమ్మతమేననీ, అయితే టికెట్‌ రేట్లు పెంచిన తర్వాత ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయాలని చిరంజీవి విన్నవించారు. చివరకు నాగార్జున స్వయంగా వెళ్లి సీఎం జగన్‌ను కలిసి వచ్చారు. సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా రంగంలోకి దిగి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి ఇంకా సానుకూల స్పందన రాలేదు.

Recommended Video

Tomato Price : Indians Google, Sambar Without Tomato || Oneindia Telugu
సీఎం జగన్ తో భేటీ కోసం వెయిటింగ్

సీఎం జగన్ తో భేటీ కోసం వెయిటింగ్

దీంతో..ఇప్పుడు ఇదే అంశం పైన సినీ పెద్దలు అమరావతి వెళ్లి నేరుగా సీఎంను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి..ముఖ్యమంత్రి వీరి అభ్యర్ధన పైన సానుకూలంగా స్పందిస్తారా.. లేక, తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనేది ఇప్పుడు పొలిటికల్..సినీ సర్కిల్స్ లో ఆసక్తి కరంగా మారుతోంది. తాజాగా, మంత్రి పేర్ని నాని సైతం తాను ఈ విషయాలను ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వటంతో...ఇండస్ట్రీ ఇప్పుడు సీఎం నిర్ణయం కోసం నిరీక్షిస్తోంది.

English summary
Balakrishna starter Akhanda movie which is releasing today will have no fan show or benefit show with AP govt bringing in the new law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X