Balakrishna: బాలయ్య అన్‌స్టాపబుల్..నేటినుండి స్వర్ణాంధ్ర సాకారయాత్ర!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న నాయకులు ప్రజల మద్దతు కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీఅధినేత జగన్ తాము అందించిన సంక్షేమ పథకాలను చెప్పడంతో పాటు, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని టిడిపి బిజెపి జనసేన మూడు పార్టీలు కలిసి పొత్తులతో తనపైన సమరానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు.
జగన్ అలా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలా
జగన్ మీ బిడ్డ.. సింగిల్ గా ఎన్నికల పోరులోకి వెళుతున్నాడు ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. ఇక టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు వైసిపి ప్రభుత్వ హ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా, భవిష్యత్తు తరాలు బాగుండాలన్నా వైసీపీని ఓడించాలని పిలుపునిస్తున్నారు.

వైఎస్ షర్మిల కూడా తగ్గేదేలే
మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్ధ పాలన పైన విరుచుకుపడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేదని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇలా రాష్ట్రంలోని పరిస్థితులను ప్రజలకు చెబుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.జగన్ ను ఓడించటమే లక్ష్యంగా షర్మిల ఎన్నికల ప్రసంగాలలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
బాలయ్య స్వర్ణాంధ్ర సాకార యాత్ర
ఇక ఇదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేటి నుంచి స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.బాలయ్య అన్‌స్టాపబుల్ పేరుతో దీనికోసం ఒక ప్రత్యేకంగా బస్సును రూపొందించారు.

ఎన్నికల ప్రచారానికి నేటినుండి రంగంలోకి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల బరిలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థుల కోసం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా బాలయ్య పర్యటిస్తారు. ఆపై ఈనెల 25వ తేదీ నుంచి ఆయన ఉత్తరాంధ్రలో ప్రచారాన్ని నిర్వహిస్తారు.ఇదిలా ఉంటే ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
బాలయ్య ప్రచారంతో తెలుగు తమ్ముళ్ళ ఉత్సాహం
ఏప్రిల్ 19వ తేదీన ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక బాలయ్య అన్ స్టాపబుల్ రంగంలోకి దిగడంతో టిడిపి శ్రేణులలో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. బాలయ్య ప్రచారంతో రాయలసీమలో అత్యధిక సీట్లు తమ ఖాతాలో పడతాయని తెలుగు తమ్ముళ్లు తొడకొట్టి మరీ చెబుతున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications