బాలకృష్ణVsపవన్: ఇరుక్కున్న చంద్రబాబు, షరతులు
హైదరాబాద్: విజయవాడ లోకసభ సీటు విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణగా మారిందని అంటున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వాలని పవన్ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు చెబుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు టిడిపి టిక్కెట్ పైన పూర్తి ధీమాతో ఉన్న కేశినేని నాని హీరో నందమూరి బాలకృష్ణకు సన్నిహితులు. పొట్లూరి కోసం పవన్, కేశినేని కోసం బాలకృష్ణ పట్టుబడుతున్నారట. ఇది చంద్రబాబుకు తలనొప్పి కలిగిస్తోందంటున్నారు. నిన్నటితో ఈ అంశం ముగిసినట్లుగా ప్రచారం జరిగినప్పటికీ... ఇంకా ఉత్కంఠగానే ఉంది.

తనకు చంద్రబాబు హామీ ఇచ్చారని కేశినేని నాని నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారట. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పొట్లూరి వర ప్రసాద్ కోసం తన బెట్టు వీడటం లేదట.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ టిడిపి - బిజెపి అభ్యర్థుల పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే, పొట్లూరికి టిక్కెట్ పైన హామీ ఇచ్చే వరకు తాను టిడిపి తరఫున ప్రచారం చేయనని పవన్ షరతు విధించారట. పొట్లూరికి విజయవాడ ఇచ్చాకే తాను ప్రచార బరిలో టిడిపి అభ్యర్థులకు ప్రచారం చేస్తానని చెబుతున్నారట. ఏం చేయాలో చంద్రబాబుకు పాలుపోవడం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications