ఎన్ కన్వెన్షన్‌పై అక్రమ నిర్మాణమని..., స్పందించకుంటే
హైదరాబాద్: హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడల పైన అక్రమ నిర్మాణమని జీహెచ్ఎంసీ అధికారులు మార్క్ చేశారు. రెడ్ కలర్‌తో వారు మార్క్ చేశారు. సాయంత్రం లోగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.
సెక్షన్ 452 ప్రకారం వారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇవ్వనున్నారు. యాజమాన్యం నోటీసులు తీసుకోకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడలకు నోటీసులు అంటించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

తుమ్మిడికుంట చెరువులో నిర్మాణం జరిగినట్లుగా అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. యాజమాన్యం వారం రోజుల్లో స్పందించకుంటే తదిపరి చర్యలు తీసుకోవాలని బల్దియా యోచిస్తోంది.
కాగా, నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో తమ్మిడికుంటకు చెందిన 3 ఎకరాలా 12గుంటల భూమిని కలుపుకొన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 1.12 గుంటల భూమి ఎఫ్‌టీఎల్ పరిధిలోది కాగా, 2 ఎకరాల భూమి బఫర్ జోన్ కిందకు వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications