ఆదానీ - జగన్ వ్యవహారం, అర్ద్రరాత్రి వేళ - బాలినేని సంచలనం..!!

పారిశ్రామిక వేత్త ఆదానీ మాజీ సీఎం జగన్ కు లంచం ఇచ్చారనే వార్త రాజకీయంగా ప్రకంపనలకు కారణమవుతోంది. తాము కేంద్రం ఆధ్వర్యంలోని సెకీతో ఒప్పందం చేసుకున్నామని..ఆదానీతో సంబంధం లేదని వైసీపీ చెబుతోంది. ఇదే సమయంలో కూటమి నేతలు మాత్రం ఈ అంశం పైన ఆచి తూచి స్పందిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన బాలినేని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ ఒప్పందంలో ఏం జరిగిందో వివరించారు.

బాలినేని వ్యాఖ్యలు
ప్రస్తుతం జనసేనలో ఉన్న బాలినేని గతంలో జగన్ హాయంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసారు. జగన్ సీఎం గా ఉన్న సమయంలో సెకీతో చేసుకున్న ఒప్పందం వెనుక ఆదానీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు ఇప్పుడు రాజకీయంగా సంచలనానికి కారణమయ్యాయి. ఈ అంశం పైన కూటమి మాత్రం వేచి చూసే ధోరణితో ఉంది. జగన్ గురించి మాట్లాడాలని.. బీజేపీ ఇబ్బంది పడకుండా వ్యవహరించాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు నిర్దేశించారు. అయితే, వైసీపీ తాజా ఆరోపణలను ఖండించింది. వైసీపీ ప్రభుత్వం కేంద్రం పరిధిలోని సెకీతో ఒప్పందం చేసు కుందని అగ్రిమెంట్ పత్రాలను బయట పెట్టింది. ఆదానీతో సంబంధం లేదని స్పష్టం చేసింది.

Balineni made sensational comments on AP Govt - Seki agreement over Adani s controversy

అర్ద్రరాత్రి ఫోన్
ఇక, ఈ వివాదం పైన మాజీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని స్పందించారు. తాను సంబంధిత మంత్రిగా ఉన్నప్పటికీ...సెకీ తో ఒప్పందం మాత్రం తన ప్రమేయం లేకుండా జరిగిందని చెప్పుకొచ్చారు. సెకీతో ఒప్పందం వేళ తనను అర్ద్రరాత్రి నిద్ర లేపి సంతకం చేయమన్నారని వివరించారు. మర్నాడు మంత్రి మండలి సమావేశం ఉండగా.. తనకు నాటి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్ద్రరాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి సెకీతో అగ్రిమెంట్ ఫైల్ పైన సంతకం చేయాలని సూచించినట్లు వెల్లడించారు. అయితే, తాను సంతకం చేయటానికి నిరాకరించానని చెప్పుకొచ్చారు. సంతకం పెట్టకుంటే ఆ ఫైల్ ను కేబినెట్ సమావేశానికి పంపాలని చెప్పారని బాలినేని వివరించారు. ఆ మర్నాడు కేబినెట్ భేటీలో ఒప్పందాన్ని ఆమోదించారని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్
సెకీతో ఒప్పందానికి సంబంధించి అదానీ నుంచి జగన్‌కు రూ.1750 కోట్ల ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. గతంలో ఈ ఒప్పందం పైన వైసీపీ వివరణ ఇస్తోంది. కేంద్ర సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వానికి ఈ ఒప్పందం పైన అనుమానాలు ఉంటే రద్దు చేయాలని తాజాగా వైసీపీ డిమాండ్ చేసింది. అయితే, జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఏపీలోనూ కూటమి నేతలు ఈ అంశం పైన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ ఒప్పందం పైన న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని.. రాష్ట్రంలో పెట్టుబడులకు నష్టం లేకుండా ఎలా ముందుకెళ్లాలో ఆలోచన చేస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు ఈ వివాదం ఏపీలో ఏ టర్న్ తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+