టిడిపి ప్రభుత్వంపై బాలినేని నిప్పులు
టిడిపి ప్రభుత్వంపై బాలినేని నిప్పులు
విజయవాడ: మహోన్నత లక్ష్యం, మానవత దృక్పథంతో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రకాశం జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో ఈ నెల 9 తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలు లోని జిల్లా కలెక్టరేట్ వద్ద పార్టీ చేపట్టే ధర్నాలో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పాల్గొననున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి. బుధవారం ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి భరోసాగా ఉన్న ఆరోగ్యశ్రీ పధకాన్ని నిర్వీర్యం చేసేందుకే టీడీపీ ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు.












Click it and Unblock the Notifications