Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ నిర్ణయంతో కలకలం - బాలినేని తాజా అల్టిమేటం..!!

వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ ప్రక్షాళనలో భాగంగా జగన్ అవసరమైన నియోజకవర్గాలతో పాటుగా జిల్లాల అధ్యక్షులను మార్పు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరు తెర పైకి వచ్చింది. ఈ ప్రతిపాదన జిల్లా వైసీపీలో కలకలంగా మారింది. దీని పైన మాజీ మంత్రి బాలినేని స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. అల్టిమేటం జారీ చేసారు.

బాలినేని వ్యాఖ్యలతో
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిపై బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రకాశం జిల్లాల్లో నాయకులకు కొదవ లేదని వ్యాఖ్యానించారు. నేతలకు జిల్లా గొడ్డు పోలేదని అసహనం వ్యక్తం చేసారు. పార్టీ అధ్యక్ష పదవి జిల్లాకు సంబంధించిన వ్యక్తులకే ఇవ్వాలని డిమాండ్ చేసారు. చెవిరెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి విషయాన్ని వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేసారు. జిల్లా నేతలకే అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని బాలినేని కోరారు. ఇతర జిల్లాల నేతలకు తమ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాల్సిన అవసరం లేదని బాలినేని పేర్కొన్నారు.

Balineni Srinivasa Reddy reacts over YS jagan latest decisions details here

ఎందుకు వెళ్లాలి
1999 నుంచి రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేసిన బాలినేని 2024 ఎన్నికలే తన చివరి ఎన్నికలని తేల్చి చెప్పారు. తాను ఏం తప్పు చేశానో తెలియదని.. ఇతరులకు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత మనస్థాపంతో హైదరాబాద్ వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు. మా కార్యకర్తలను కొట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని.. దమ్ము, ధైర్యం ఉంటే తనను ఎదుర్కోవాలని సవాల్ చేసారు. తాను ఒంగోలును విడిచి పెట్టను... ఇక్కడే ఉంటానని స్పష్టం చేసారు. తాను జనసేన లో చేరుతున్నారని ప్రచారం చేస్తున్నారు... తాను ఎందుకు జనసేనకి వెళ్లాలని ప్రశ్నించారు.

నిరూపించండి
నేను మంత్రిగా ఉండగా హవాలా మంత్రి అని ప్రచారం చేశారని.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేసారు. వ్యాపారులను బెదిరించి ఏనాడూ అవినీతికి పాల్పడలేదు... అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే ఇక్కడే ఉరేసుకుని చస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను అవినీతికి పాల్పడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు స్వయంగా విచారణ జరిపించవచ్చన్నారు. జగన్ పై కేసులు పెట్టి జైలుకు పంపినప్పుడు తన పై కూడా సిబిఐ జెడి లక్ష్మీనారాయణతో విచారణ జరిపారని..తనకు క్లీన్ చీట్ లభించిందని బాలినేని గుర్తు చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+