బాలినేనికి "మెగా" ఆఫర్, పవన్ తో భేటీ - జగన్ కు లేఖలో..!!
మాజీ మంత్రి బాలినేని వైసీపీని వీడారు. కొంత కాలంగా బాలినేని వైసీపీ వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బాలినేని తాను వైసీపీని వీడుతున్నట్లు నేరుగా జగన్ కు లేఖ రాసారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. బాలినేని జనసేనలో చేరాలని నిర్ణయించారు. గురువారం పవన్ తో భేటీ కానున్నారు. ఇప్పటికే బాలినేనికి జనసేన నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
బాలినేని లేఖ
బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పారు. మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని పక్కన పెట్టిన సమయం నుంచి ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఒంగోలు ఎంపీగా సిట్టింగ్ గా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికే తిరిగి సీటు ఇవ్వాలని చివరి నిమిషం వరకు బాలినేని పట్టు బట్టారు. చెవిరెడ్డిని ఎంపీగా పోటీ చేయించటాన్ని వ్యతిరేకించారు. ఇక..ఎన్నికల ఫలితాల తరువాత ఈవీఎంల పైన బాలినేని న్యాయ పోరాటానికి దిగారు. కానీ, పార్టీ నుంచి సహకారం లేకపోవటం పైన అసహనం వ్యక్తం చేసారు. తాజాగా జగన్ ను కలిసి తాను పార్టీ వీడాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

పవన్ తో భేటీ
ఆ సమయంలో పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని..పార్టీలో కొనసాగాలని జగన్ సూచించారు. ఆ ప్రతిపాదనను బాలినేని తిరస్కరించారు. ఇక, కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబుతో బాలినేని టచ్ లో ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో నేరుగా సమావేశమయ్యారు. గతంలోనూ పవన్ ను బాలినేని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. బాలినేని గురించి పవన్ సానుకూలంగా వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు టీడీపీ లో ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటం తో జనసేనలో చేరాలని నిర్ణయించిన బాలినేని..రేపు (గురువారం) జనసేనాని పవన్ తో సమావేశం కానున్నారు.
జగన్ కు లేఖలో
ఇక, జగన్ కు బాలినేని రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తాను అయిదు సార్లు ఎమ్మెల్యేగా..రెండు సార్లు మంత్రిగా పని చేసిన విషయాన్ని గుర్తు చేసారు. నిర్ణయాలు సరిగ్గా లేని సమయంలో తాను జగన్ ను ప్రశ్నించానని పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రజా తీర్పు ఎలా ఉన్నా గౌరవించాలన్నారు. రాజకీయా లు వేరు..బంధుత్వాలు వేరని వ్యాఖ్యానించారు. భాష హుందాగా ఉండాలని..విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధుల పైన ఉందన్నారు. వ్యకత్ిగత కారణాలతోనే తాను పార్టీ వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా తన వద్దు వచ్చిన ప్రతీ ఒక్కరికి సాయం చేసానని లేఖలో వివరించారు.












Click it and Unblock the Notifications