బియ్యం ఎగుమతులపై నిషేధం ఎఫెక్ట్; అక్కడ నో స్టాక్ బోర్డులు!!

పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాల ధరలను కంట్రోల్ చెయ్యటం కోసం భారత్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపించనుంది. బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతిపై తక్షణమే భారత్ నిషేధం విధించింది.

భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు పొదుపు 18 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో ఏడు మిలియన్ టన్నులు తెల్ల బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఇక దేశం నుండి జరిగే మొత్తం ఎగుమతులలో 10 నుండి 15% ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండే జరుగుతున్నాయి.

Ban on rice exports; Rice woes for NRIs; No stock boards in US!!

ఇదిలా ఉంటే యూఎస్ భారతదేశం నుండి బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంది. అయితే యూఎస్ లో వినియోగించే బియ్యంలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ ఇండియా నుండి దిగుమతి చేసుకుంటుంది. ప్రధానంగా భారతదేశం నుండి ఎగుమతి అయ్యేవి బాస్మతి వంటి ఫైన్ రకాలు. దీంతో ఇండియా విధించిన కొత్త ఎగుమతి పరిమితులు బహుశా అక్కడ మార్కెట్‌ను ఎక్కువగా ప్రభావితం చేయవు.

కానీ ఈ విషయాలు పక్కనపెడితే భారత్ బియ్యం ఎగుమతులు ఆపివేసింది అనగానే అక్కడ ఉన్న ఇండియన్స్ ఇబ్బంది పడతారు. దీంతో ప్రస్తుతం అక్కడ బియ్యం ధరలు గణనీయంగా పెంచి వ్యాపారులు విక్రయాలు చేస్తారు. భారతదేశం కొన్ని గ్రేడ్‌ల బియ్యం ఎగుమతిపై కొత్త నిషేధాన్ని విధించటం ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆహార సరఫరా అంతరాయాలను కలిగించే అవకాశాన్ని పెంచుతుంది.

ఇదిలా ఉంటే తెల్ల బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడంతో యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలలో ఉన్న భారతీయులకు షాక్ తగులుతోంది. వారికి బియ్యం కష్టాలు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో భారతీయులకు బియ్యం ఎగుమతుల నిషేధం ఇబ్బందులను తెచ్చిపెడుతోంది .

చాలామంది భారతీయులు ముందస్తు జాగ్రత్తగా ఎక్కువ మొత్తంలో బియ్యాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకొని స్టోర్ చేసుకుంటున్నారు. షాపుల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ముందు ముందు ఈ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+