జగన్ సర్కార్ పై బండి సంజయ్ విమర్శలు-పవన్ పై ప్రశంసలు-బీజేపీ ఇన్ ఛార్జ్ హోదాలో తొలిసారి..

ఏపీలో వైసీపీ సర్కార్ పై తెలంగాణ బీజేపీ నేత, ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కూడా అయిన బండి సంజయ్ ఇవాళ తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే తమ పార్టీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు.బీజేపీ ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించిన బండి సంజయ్.. ఏపీలో రాజకీయ పార్టీలపై తొలిసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఇవాళ ఏపీలో జగన్ సర్కార్ పై నిశిత విమర్శలు చేశారు.తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్ దే అన్నారు. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయన్నారు. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు.ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమన్నారు.

bandi sanjay slams jagan regime and lauds pawan kalyan in bjp voter chetan mahabhiyaan

డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో దోచుకుతింటున్నారని ఏపీ సర్కార్ పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈసారి వైఎస్సార్ సీసీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొందన్నారు. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోందన్నారు.

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో జగన్ సర్కార్ నిమగ్నమైందని బండి ఆరోపించారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడగడుగునా ఆందోళన కలిగిస్తూ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? అంటూ ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజంకాదా అని బండి ప్రశ్నించారు?

పవన్ కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేతని బండి సంజయ్ ప్రశంసించారు. ప్రజా సమస్యలపై జనంలోకి వెళుతుంటే ఆయనను అడ్డుకోవడం దారుణమని బండి విమర్శించారు. ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్ అధికారంలోకి వచ్చారని, కానీ ఈరోజు నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ పాదయాత్రలను అపే కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+