నకిలి సర్టిఫికెట్లు: బెంగళూరులో గుంటూరువాసి అరెస్టు
బెంగళూరు: నకిలి సర్టిఫికెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన లక్ష్మి కృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేశామని సీసీబీ పోలీసు అధికారులు చెప్పారు. ఈ దందాలో ఉంటూ పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇతను బెంగళూరు చేరుకుని మారతహళ్ళి సమీపంలోని మునేకోళ్లాళ లో నివాసం ఉంటున్నాడు. తరువాత బెంగళూరు నగరానికి వస్తున్న నిరుద్యోగులను సంప్రదిస్తున్నాడు. కొత్తగా ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమని వారికి మాయమాటలు చెబుతున్నాడు.

గతంలో మీరు వేరే కంపెనీలలో ఉద్యోగం చేసినట్లు (అనుభవం ఉన్నట్లు) కొన్ని పత్రాలు ఉంటే సులభంగా ఉద్యోగం వస్తుందని నమ్మించాడు. వారికి ఎక్స్ ఫీరియన్స్, రిలీవింగ్ లెటర్, స్యాలరీ సర్టిఫికెట్లు, అపాయింట్ మెంట్ లెటర్ తో సహ అన్ని రకాల సర్టిఫికెట్లు ఇస్తామని మాయమాటలు చెప్పాడు.
ఒక్కోక్కరి దగ్గర రూ. 20 వేలు తీసుకుని ఈ నకిలి సర్టిఫికెట్లు ఇస్తున్నాడు. మోసపోయిన బాధితులు లక్ష్మి కృష్ణ, అతనికి సహకరిస్తున్న కిరణ్ అనే వ్యక్తి మీద మైకో లేఔట్, హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. కచ్చితమైన వివరాలు సేకరించి లక్ష్మి కృష్ణను అరెస్టు చేశామని, నకిలి పత్రాలు, మొబైల్, బైక్ స్వాధీనం చేసుకున్నామని, కిరణ్ కోసం గాలిస్తున్నామని సీసీబీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications